ఎవరినీ వదలొద్దు.. ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఎవరినీ వదలొద్దు.. ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
x
Highlights

దేవుడి పేరు మీద కొంతమంది రాజకీయాలు చేస్తున్నారని ఏపీ సీఎం జగన్ అన్నారు.

దేవుడి పేరు మీద కొంతమంది రాజకీయాలు చేస్తున్నారని ఏపీ సీఎం జగన్ అన్నారు. దేవుడి విగ్రహాలతో చెలగాటం ఆడుతున్నారని.. ఎవరు, ఎందుకోసం చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు. దేవుడి గుళ్లను కూడా వదలకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ధ్వంసం చేసిన వారే రచ్చ చేస్తున్నారన్నారు. విగ్రహాల ధ్వంసంతో రాజకీయ లబ్ధి చేకూరాలని చూస్తున్నారన్నారు. దేవుడి పేరుతో రాజకీయ నాయకులు కుట్రలు పన్నుతున్నారని సీఎం జగన్ తెలిపారు.

ప్రభుత్వ పథకాల కార్యక్రమాలు ప్రారంభించిన నాటి నుంచే ఘటనలు జరుగుతున్నాయన్నా ఏపీ సీఎం జగన్. అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. అది సహించలేకే దేవుడి పేరుతో రాజకీయ చేస్తున్నారన్నారు. తప్పు ఎవరు చేసిన వదలొద్దన్నారు. తమ వారు చేసిన తప్పు తప్పేనని పేర్కొన్నారు.

సైబర్ సెక్యూరిటీ, మహిళా రక్షణపై పోలీస్ డ్యూటీ మీట్‌లో ప్రధాన చర్చ జరుగుతుందని సీఎం జగన్ తెలిపారు. ఈ మీట్‌లో పోలీసులు పనితీరు, ఆలోచన మార్చుకునేందుకు పోలీస్ మీట్ ఉపయోగపడుతుందన్నారు. ఇక నుంచి ప్రతీఏటా ఇలాంటి మీట్‌లు జరుగుతాయన్నారు. గత ఆరేళ్లుగా పోలీస్ మీట్ జరగలేదన్నారు. టెక్నాలజీని మెరుగుపరిచేందుకు ప్రపంచ ఖ్యాతి గాంచిన సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నమన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories