వైఎస్‌ భారతి తండ్రి గంగిరెడ్డి కన్నుమూత

వైఎస్‌ భారతి తండ్రి గంగిరెడ్డి కన్నుమూత
x
Highlights

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మామ, వైఎస్‌ భారతి తండ్రి, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మామ, వైఎస్‌ భారతి తండ్రి, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. కాగా.. గంగిరెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి తండ్రి. ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యులుగా ఉన్నారు. పులివెందుల చుట్టుపక్కల గ్రామాల్లో మంచి హస్తవాసి వైద్యుడిగా గంగిరెడ్డికి పేరుంది. అంతేకాదు పేదల డాక్టర్‌గా మంచి గుర్తింపు పొందారు కూడా. కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. అంతేకాదు 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకూ పాదయాత్ర కూడా నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీకి జగన్ రాజీనామా చేయక ముందే అల్లుడిపై కేసులకు నిరసనగా గంగిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించారు. బహుశా వైఎస్ బంధువర్గం నుంచి మొట్టమొదటి కాంగ్రెస్ కు రాజీనామా ఆయనదే అయి ఉండొచ్చు. కొద్దిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగిరెడ్డిని సీఎం జగన్ గత నెల పరామర్శించారు. ఇదిలావుంటే నెలరోజుల కిందటే గంగిరెడ్డి అన్న పెద్దగంగిరెడ్డి కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. తండ్రి మృతిచెందడంతో హుటాహుటిన వైఎస్ భారతి హైదరాబాద్ కు బయలుదేరారు. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ కూడా పులివెందుల వెళ్లే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories