ఆమె ఆత్మహత్యకు కారణం అదికాదు : విశాఖ పోలీసులు

ఆమె ఆత్మహత్యకు కారణం అదికాదు : విశాఖ పోలీసులు
x
actro sushanth singh rajput (file image)
Highlights

విశాఖ జిల్లా శ్రీహరిపురం పవనపుత్ర నగర్ లో ఈ నెల 16న ఆత్మహత్యకు పాల్పడ్డ మహిళ సుమన్ కుమారి కేసుపై కొన్ని మాధ్యమాల్లో ఊహాగానాలు ప్రచారం చేయడం సరికాదని మల్కాపురం సిఐ దుర్గాప్రసాద్ అన్నారు.

విశాఖ జిల్లా శ్రీహరిపురం పవనపుత్ర నగర్ లో ఈ నెల 16న ఆత్మహత్యకు పాల్పడ్డ మహిళ సుమన్ కుమారి కేసుపై కొన్ని మాధ్యమాల్లో ఊహాగానాలు ప్రచారం చేయడం సరికాదని మల్కాపురం సిఐ దుర్గాప్రసాద్ అన్నారు. కేసు విచారణలో ఉండగా ధోనీ బయోపిక్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య కు మనస్తాపం చెంది సుమన్ కుమారి బలవన్మరణానికి పాల్పడినట్టు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఇంకా ఏ విధమైన నిర్ధారణకు రాలేదని తెలిపారు. మృతురాలు స్థానిక సాగర్ పబ్లిక్ స్కూల్లో టీచర్ గా పనిచేసేదని చెప్పారు.

ఆమెకు ఎక్కువగా ఒంటరిగా ఉండడం అలవటాని తెలిపారు..కేసు పూర్తిగా దర్యాప్తు అయిన తరువాత వివరాలు తెలుపుతామని సీఐ దుర్గాప్రసాద్ స్పష్టం చేశారు. కాగా సుమన్‌ కుమారికి టిక్‌ టాక్‌ వీడియోలు ఎక్కువగా చూసేది. ఈ క్రమంలో ఈ ఆదివారం బాలీవుడ్‌ నటుడు సుషాంత్‌ సింగ్‌ మరణానికి సంబంధించి టిక్‌ టాక్‌లో తరచూ వీడియోలు చూసినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుషాంత్‌ మృతి పట్ల తీవ్ర ఒత్తిడికి గురైన సుమన్‌ కుమారి ఇంట్లోని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories