NDA Meeting: ఏన్‌డీఏ పక్ష భేటీకి దూరంగా వైసీపీ,టీడీపీ..

YCP TDP Stay Away From NDA Party Meeting
x

NDA Meeting: ఏన్‌డీఏ పక్ష భేటీకి దూరంగా వైసీపీ,టీడీపీ..  

Highlights

NDA Meeting: బీజేపీతో నేరుగా సంబంధాలకు వెనకడుగు వేస్తున్న రెండు పార్టీలు

NDA Meeting: ఇక ఏపీలో సైతం ప్రస్తుతం ఇదే స్ట్రాటజీని వైసీపీ, టీడీపీలు అమలు చేస్తున్నాయి. బీజేపీతో నేరుగా సంబంధాలకు ఈ రెండు పార్టీలు వెనకడుగు వేస్తున్నాయి. రాష్ట్రానికి పాలనాపరంగా ఉండే అవసరాలపై తప్ప... మిగితా విషయాల్లో దూరంగా ఉండాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా సీఎం జగన్ కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే టీడీపీ స్ట్రాటజీపై క్లారిటీ రావాల్సి ఉంది. బీజేపీ, జనసేనతో టీడీపీ పొత్తుపై ఇంకా ఓ స్పష్టత రాలేదు. దీంతో టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతుందా..? లేక పొత్తులతో ముందుకు వెళుతుందా అన్నది తేలాల్సి ఉంది.

మరో వైపు రాష్ట్రానికి బీజేపీ చేసిందేమి లేదన్న భావనలో ఏపీ ప్రజలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే... బీజేపీకి దూరంగా ఉండి సొంతగానే బలం పెంచుకోవాలన్న భావనలో టీడీపీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. యూపీఏ,ఎన్‌డీఏలకు దూరంగా ఉంటూనే... ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో వైసీపీ,టీడీపీ చర్చ జరుగుతోంది. ఇలా సమాన దూరం పాటిస్తూ తాము ఏ కూటమిలో లేమని వైసీపీ,టీడీపీలు సంకేతాలిస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories