YSRCP: మార్పులు-చేర్పులు.. 175 కు 175 స్థానాలను సొంతం చేసుకోవాలనే యోచనలో వైసీపీ

YCP Party Wants To Get 175 Out Of 175 Seats In Upcoming Elections
x

YSRCP: మార్పులు-చేర్పులు.. 175 కు 175 స్థానాలను సొంతం చేసుకోవాలనే యోచనలో వైసీపీ

Highlights

YSRCP: పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు సీఎంవో నుంచి పిలుపు

YSRCP: ఏపీలో రానున్న ఎన్నికల్లో 175 కు 175 స్థానాలను సొంతం చేసుకోవాలనే యోచనలో ఉన్న అధికార వైసీపీ.. ఆ విధంగా ప్రణాళికలను రచిస్తూనే ఉంది. అనుకున్న టార్గెట్‌ను రీచ్‌ కావడం కోసం పార్టీలో మార్పులు-చేర్పులను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా.. పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు సీఎంవో నుంచి పిలుపు అందింది. దీంతో.. తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌కు అసంతృప్త ఎమ్మెల్యేలు, నేతల క్యూ కడుతున్నారు. సజ్జల, ధనుంజయరెడ్డిని కలుస్తున్నారు. అవకాశాన్ని బట్టి సీఎం జగన్‌తోనూ సమావేశం అవుతున్నారు.

తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌కు ఎంపీ మోపిదేవి వెంకటరమణ వెళ్లారు. రేపల్లె ఇన్‌ఛార్జ్‌గా మోపిదేవిని తప్పించి ఈవూరి గణేష్‌ను సీఎం జగన్‌ నియమించారు. రేపల్లె టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు మోపిదేవి వెంకటరమణ. అటు.. కనిగిరి టికెట్‌ కోసం ఎమ్మెల్యే బుర్రా తీవ్ర ప్రయత్నాలు జరుపుతున్నారు. కనిగిరి ఇన్‌ఛార్జ్‌గా మధుసూదన్‌ను ఇటీవలే తప్పించారు సీఎం. దద్దాల నారాయణకు కనిగిరి టికెట్‌ను ఇచ్చారు. దీంతో మరోసారి సీఎంవోకు వచ్చిన బుర్రా మధుసూదన్‌యాదవ్.. తనకు ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు.

మరోవైపు.. నూజివీడు వైసీపీ ఇన్‌ఛార్జ్‌ మార్పుపై సీఎం జగన్‌ కసరత్తు చేస్తున్నారు. నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్.. తన కుమారుడు వేణుగోపాల్‌ను వెంటబెట్టుకుని సీఎంవోకు వచ్చారు. చీరాల అసెంబ్లీ టికెట్‌ కోసం ఆమంచి కృష్ణమోహన్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎంవోకు వచ్చిన పర్చూరు వైసీపీ ఇన్‌‌ఛార్జ్‌ ఆమంచి కృష్ణమోహన్.. చీరాల ఇన్‌ఛార్జ్‌గా ఉన్న కరణం వెంకటేష్‌ను తప్పించి.. తనకు సీటు ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే విషయంపై సజ్జల, ధనుంజయరెడ్డితోనూ ఆమంచి చర్చించినట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories