లీకేజీ, డ్యామేజీ, మైలేజీ..ఎవరికేది?

లీకేజీ, డ్యామేజీ, మైలేజీ..ఎవరికేది?
x
Highlights

సచివాలయ ఉద్యోగాల నియామకపత్రాలు సంబరం సాగింది. ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల్లో మంత్రులు, విజయవాడలో సీఎం జగన్‌ చేతుల మీదుగా అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు...

సచివాలయ ఉద్యోగాల నియామకపత్రాలు సంబరం సాగింది. ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల్లో మంత్రులు, విజయవాడలో సీఎం జగన్‌ చేతుల మీదుగా అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు అందుకున్నారు అభ్యర్థులు. ఈ ఒక్క ఉద్యోగాల నియామకంతోనే, జగన్‌ సర్కారుకు ఎనలేని పొలిటికల్ మైలేజ్ వచ్చిందన్న చర్చ ఒకవైపు జరుగుతుంటే, మరోవైపు క్వశ్చన్‌ పేపర్ లీకేజీతో వైసీపీ కార్యకర్తలకే ఉద్యోగాలిచ్చారంటూ, వైసీపీ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేయాలని ఆరోపణలు కురిపిస్తోంది టీడీపీ. అయినా ఈ ఆరోపణలపై కనీసం స్పందించకుండా, పట్టుదల ప్రదర్శించారు జగన్.

సెప్టెంబర్‌ 30. ఆంధ‌్రప్రదేశ్‌లో లక్షన్నర కుటుంబాలు మర్చిపోలేని రోజు. ఎందుకంటే, లక్షన్నరమంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులుగా నియామక పత్రాలు అందుకున్నారు. చరిత్రలో కనివిని ఎరుగని ప్రభుత్వ ఉద్యోగాల నియామకంగా, వైసీపీ నాయకులు చెబుతున్నారు. అటు అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే లక్షన్నర ఉద్యోగాలు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని, కొత్తగా ఎంపికైన గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. జిల్లాల వ్యాప్తంగా మంత్రులు నియామకపత్రాలు అందజేస్తే, విజయవాడలో స్వయంగా సీఎం జగన్‌ చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్లు అందుకున్నారు యువతీ, యువకులు. ఈ ఒక్క గ్రామ సచివాలయ ఉద్యోగాలతో, జగన్‌ సర్కారు ఇమేజ్‌ అమాంతం పెరిగిందని అంతటా వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా, విజయం వైసీపీదేనన్నట్టుగా, పొలిటికల్ మైలేజ్ వచ్చిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే, క్వశ్చన్‌ పేపర్‌ లీక్ అయ్యిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పటికీ, అలాంటి విమర్శలు, ఆరోపణలపై ఏమాత్రం చలించకుండా, నియామకాల పత్రాల జారీకే ముందుకెళ్లిన జగన్‌ పట్టుదలపైన కూడా అంతటా చర్చ జరుగుతోంది.

గ్రామ సచివాలయ ఉద్యోగాల పరీక్షా పత్రాలు లీకు అయ్యాయంటూ, కొన్ని పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తా కథనాలు వచ్చాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, జాబ్‌లు అమ్ముకున్నారన్న ఆరోపణలూ వచ్చాయి. APPSC కార్యాలయంలోని చిన్న ఉద్యోగులు, గ్రామ సచివాలయ ఉద్యోగులుగా ఎంపికవ్వడమే అక్రమాలకు నిదర్శమని టీడీపీ నేతలతో పాటు చంద్రబాబు విమర్శలు కురిపించారు. అయితే ఇన్ని ఆరోపణలు వచ్చినా, ఏమాత్రం పునరాలోచించలేదు సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి. నియామక పత్రాల జారీ ఫంక్షన్‌లో, పరీక్ష నిర్వాహకులపై ప్రశంసలు కురిపించారు. లక్షన్నర ఉద్యోగులు, లక్షల అభ్యర్థులతో పరీక్ష, ఇంత పెద్ద టాస్క్‌ను సమర్థంగా నిర్విహించారంటూ అభినందించారు. ఎక్కడా చిన్నపాటి ఇబ్బందుల్లేకుండా ఆర్గనైజ్ చేశారని అప్రిషియేట్ చేశారు.

పేపర్‌ లీకేజీపై ఆరోపణలను ఏమాత్రం కన్సిడర్ చేయలేదు జగన్‌. ఒకవేళ పేపర్‌ లీకయినా, కొందరికే అందివుంటాయన్న చర్చ వుంది. అందుకే టీడీపీ ఆరోపణలపై స్పందించలేదు జగన్. ఒకవేళ నిజంగా పేపర్ లీకయ్యింది, గోల్‌మాల్‌ జరిగిందని విచారణకు ఆదేశిస్తే, పరీక్ష విలువ కోల్పోతుంది. ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన పరీక్షపై నీలినీడలు కమ్ముకుంటాయి. అందుకే మొండిపట్టుదలగా జగన్ ముందుకెళ్లారన్న చర్చ జరుగుతోంది. తాను ఇగ్నోర్ చేయదలచుకుంటే, ఎంత పెద్ద ఇష్యూనైనా ఇగ్నోర్ చేయగలనని నిరూపించుకున్నారు జగన్. ఈ ఒక్క పరీక్షతోనే ఎలక్షన్స్‌కు వెళ్లగలిగేంతగా అడ్వాంటేజ్‌ వచ్చిందని, వైసీపీ నేతలంటున్నారు. మొత్తానికి గ్రామ సచివాలయ ఉద్యోగాలతో జగన్‌ సర్కారుకు పొలిటికల్‌ మైలేజ్‌ వచ్చిందని ఒకవైపు చర్చ జరుగుతుంటే, ఎలాగైనా ఆ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేయాలన్న టార్గెట్‌తో, టీడీపీ క్వశ్చన్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారాన్ని హైలెట్‌ చేస్తోందన్న చర్చ జరుగుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories