Y S Jagan: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌కు వైసీపీ అధినేత జగన్ లేఖ

YCP Chief Jagan Letter To AP Assembly Speaker
x

Y S Jagan: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌కు వైసీపీ అధినేత జగన్ లేఖ 

Highlights

Y S Jagan: విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే.. వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి

Y S Jagan: ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. లేఖలో తన అసంతృప్తిని వెల్లడించారు. ప్రమాణ స్వీకారం రోజు మంత్రులు తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం ఇప్పటివరకూ వస్తున్న సంప్రదాయాలకు విరుద్ధం అని జగన్ లేఖలో ప్రస్తావించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నట్టున్నారని... విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని నిర్వచించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలనే ఎక్కడా లేదన్నారు. పార్లమెంట్‌లోనూ ఉమ్మడి ఏపీలో ఈ నిబంధనలు పాటించలేదన్నారు.

కూటమి, స్పీకర్ తనపై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని.. అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితి కనపడటం లేదన్నారు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజల సమస్యలను బలంగా వినిపించగలమని... ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ లేఖలో అంశాలను పరిశీలించాలని జగన్ స్పీకర్‌ను కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories