YCP Bus Yatra: నేటి నుంచి వైసీపీ బస్సు యాత్ర

YCP Bus Yatra from Today
x

YCP Bus Yatra: నేటి నుంచి వైసీపీ బస్సు యాత్ర

Highlights

YCP Bus Yatra: సామాజికి సాధికార యాత్ర పేరుతో నియోజకవర్గాల టూర్

YCP Bus Yatra: వైనాట్ 175 నినాదంతో దూకుడు పెంచుతోన్న వైసీపీ ప్రజాక్షేత్రంలో యాక్టివ్ అయ్యేలా ప్రణాళికలు చేస్తోంది. YCP పాలనలో చేసిన సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాలుగు కార్యక్రమాలు చేపట్టనున్నట్టు పార్టీ అధినేత జగన్ తెలిపారు. అందులో భాగంగానే బస్సు యాత్రతో నియోజకవర్గాలు చుట్టేసేందుకు ప్లాన్ చేసింది వైసీపీ. ఇవాళ సామాజిక సాధికార యాత్ర పేరిట ఉత్తరాంధ్రలో యాత్ర ప్రారంభం కానుంది. ఇచ్ఛాపురం, కోస్తాలోని తెనాలి, రాయలసీమలోని శింగనమల నియోజకవర్గాల్లో ఒకేసారి యాత్రను ప్రారంభించనుంది వైసీపీ.

ఏపీలో చంద్రబాబు అరెస్ట్ అనంతరం రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీతో జనసేన పొత్తుతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇప్పటికే జనసేన వారాహి యాత్రతో ప్రజల్లోకి వెళ్తుండగా.. నిన్న నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రకు శ్రీకారం చుట్టారు. త్వరలోనే లోకేష్ కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చే అవకాశాలున్నాయి. దీంతో టీడీపీ, జనసేనకు దీటుగా యాక్టివ్‌గా ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. రోజుకు 3 నియోజకవర్గాలు పర్యటించి.. డిసెంబరు 31 వరకు మొత్తం 39 నియోజకవర్గాలను చుట్టేసేలా యాత్రను ప్లాన్ చేసింది వైసీపీ.

ఇక బుధవారం ఢిల్లీలో అమిత్ షా, పవన్ కల్యాణ్ భేటీతో కూడా వైసీపీ అలర్ట్ అయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై షా, పవన్ మధ్య చర్చలు జరగడంతో పరిణామాలపై ఆరా తీస్తోంది వైసీపీ అధిష్టానం. ఇప్పటికే టీడీపీతో పొత్తు ప్రకటించే సమయంలో పవన్ తమతో బీజేపీ కలిసి వస్తే బాగుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు కన్ఫామ్ అయితే ఆ ఎఫెక్ట్‌ ఏపీపై పడే అవకాశాలున్నాయనే భావనలో ఉంది వైసీపీ. అందుకే సంక్షేమాస్త్రంతో ఇప్పటినుంచే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది వైసీపీ.

యాత్రలో భాగంగా నియోజకవర్గాల్లో సభలను నిర్వహిస్తారు వైసీపీ నేతలు. అంటే రోజూ మూడు ప్రాంతాల్లో మూడు సభలు నిర్వహించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త సారథ్యంలో ఈ యాత్ర జరగనుంది. రాష్ట్రంతో పాటు ఆ నియోజకవర్గంలో సంక్షేమాభివృద్ధి పథకాలు, పదవుల పంపకంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేసిన ప్రయోజనాన్ని ఈ యాత్ర ద్వారా ఆయా వర్గాలకు చెందిన మంత్రులు, వైసీపీ నేతలు వివరించనున్నట్లు సమాచారం. సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీని గెలిపించాల్సిన అవసరాన్ని ప్రజలకు బస్సు యాత్రలో వివరిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories