Women's day Special: పురుషులకు దీటుగా చిత్రకారులుగా మెరుస్తున్న మహిళలు

Womens day Special: పురుషులకు దీటుగా చిత్రకారులుగా మెరుస్తున్న  మహిళలు
x
Highlights

Women's day Special: కడప యోగివేమన విశ్వవిద్యాలయం యువతులు * ఫైన్ ఆర్ట్స్‌ రంగంలో దూసుకుపోతున్న విద్యార్థులు

Women's day Special: ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటి పురుషులతో సమానంగా రాణిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. విద్యా, ఉద్యోగ, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళల ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది. ఉన్నత శిఖరాలను చేరుకుని పురుష శక్తికీ తామేమీ తీసిపోమని చాటి చెప్తున్నారు. పరుగులు పెట్టించే జనరేషన్‌లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పటి వరకు పురుషులే లీడ్ చేస్తున్న ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగంలోనూ మహిళలు రాణిస్తున్నారు.

ఇన్నాళ్లు పురుషులే రాణిస్తున్న రంగంలో అద్భుతమైన బొమ్మలతో అబ్బురపరుస్తున్నారు కడప యోగి వేమన ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థినీలు.. శిల్పాలు.. సంస్కృతి, సంప్రదాయాలు, మనుషుల ఉద్వేగాలు పోరాటం, ప్రేమ వంటి చిత్రాలకు ప్రాణం పోస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పురుషులే ఉన్న ఈ రంగంలో ఇప్పుడు మహిళలు కూడా ఉపాధి పొందుతున్నారు.

యోగివేమన విశ్వవిద్యాలయంలో మూడేళ్ల క్రితమే డాక్టర్ వైఎస్సాఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. మొదట్లో ఈ కోర్సులో చేరేందుకు మహిళలు ముందుకు రాలేదు.. కానీ, రెండేళ్ల క్రితం నుంచి ఈ కోర్సులో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా చేరుతున్నారు. ఇప్పుడే వివిధ రూపాల్లో వారేస్తున్న బొమ్మలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

పురుషులతో పాటు సమానంగా మహిళలు కూడా ఫైన్ ఆర్ట్స్‌పై మక్కువ పెంచుకుంటున్నారు. వెబ్ ఆధారిత సేవలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో పాటు యానిమేషన్‌, ప్రచారం, మల్టీమీడియా, జియోస్పేషియల్, ఫ్యాషన్ రంగాల్లో ఫొటోగ్రఫీకి డిమాండ్ ఉండడంతో ఈ రంగంలోకి రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చిన్నతనం ఇంట్రెస్ట్ ఉండడంతో చాలా మంది యువతులు ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తమకు ఇష్టమైన కోర్సు చదువుతుండటం తమకెంతో సంతృప్తినిస్తుందంటున్నారు.

ఫైన్ ఆర్ట్స్ ఇష్టమున్నా కొంతమంది తల్లిదండ్రులు మాత్రం ఆ కోర్సు చేయించేందుకు అంతగా ఇష్టపడరు.. కానీ, ఫైన్ ఆర్ట్స్ లో ఉన్న అవకాశాలను తెలుసుకుని పట్టుబడి ఈ కోర్సులో చేరేందుకు యువతులు ఇంట్రెస్ట్ చూపుతున్నారంటున్నరు అకామీక్ లెక్చరర్ సుజాత.

మొత్తానికి పురుషుల సాధ్యమనుకున్న ఫైన్ ఆర్ట్స్‌లో చేరుతున్నారు. కుంచె పట్టి అందమైన బొమ్మలను గీస్తున్నారు. బొమ్మగీసి రేపటి తరానికి అందమైన ప్రపంచం అందించేందుకు యోగి వేమన యూనివర్సిటీ విద్యార్థులు ప్రయత్నం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories