Woman Complaint against ASI in Guntur: పోలీసులపై ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు

Woman Complaint against ASI in Guntur: పోలీసులపై ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు
x
Representational Image
Highlights

Complaints Against Police in Guntur: గుంటూరు జిల్లా ముప్పాళ్ల ఎస్సైపై ఓ మహిళా చేసిన ఆరోపణల్లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.

Woman Complaint against ASI in Guntur: గుంటూరు జిల్లా ముప్పాళ్ల ఎస్సైపై ఓ మహిళా చేసిన ఆరోపణల్లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఎస్సై జగదీశ్ పై సింధు కావాలనే దుష్ప్రచారం చేస్తోందని ఆమె మొదటి భర్త సుబ్బారావు ఆరోపించాడు. అసలు తనపై ఫిర్యాదు చేసేందుకు సింధు పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేదని... ఓ చోరీ కేసులో ఆమె పీఎస్‌కు వెళ్లిందని సుబ్బారావు తెలిపాడు. తనకు, సింధుకు పుట్టిన బాబును.... జగదీశ్‌‌కు జన్మించినట్లు తప్పుడు ప్రచారం చేస్తోందన్నాడు. డబ్బు కోసం సింధు బ్లాక్ మెయిల్ చేయడమే పనిగా పెట్టుకుందని ఆమె మొదటి భర్త సుబ్బారావు అంటున్నాడు.

ముప్పాళ్ల ఎస్సైపై నరసరావుపేట పోలీస్‌స్టేషన్‌లో సింధు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తన భర్తతో గొడవలు జరుగుతున్నాయని... సహాయం చేయాలని ఎస్సై జగదీశ్‌ను 2013లో కలిసినట్లు ఆమె తెలిపింది. అప్పటి నుంచి ఎస్సైతో రిలేషన్ ఉందని ఆరోపిస్తోంది. తన భర్తకు విడాకులిప్పించి.. తనతో చాలాకాలం కలిసున్న ఎస్సై జగదీశ్‌ నుంచి... ప్రస్తుతం తనకు, తన కుమారుడికి ప్రాణహాని ఉందంటూ కంప్లైంట్‌లో పేర్కొంది. అయితే ఎస్సై జగదీశ్ పై సింధు చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని... ఆమె మొదటి భర్త సుబ్బారావు మీడియా ముందుకు రావడంతో.. వ్యవహారం మరో మలుపు తీసుకుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories