Polavaram Project: ఈసారి పోలవం ప్రాజెక్టు పూర్తైయ్యేనా..?

Will the Polavam Project be Completed This Time
x

Polavaram Project: ఈసారి పోలవం ప్రాజెక్టు పూర్తైయ్యేనా..?

Highlights

Polavaram Project: ఏపీలో ప్రాజెక్టుల పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది పోలవరం ప్రాజెక్ట్.

Polavaram Project: ఏపీలో ప్రాజెక్టుల పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది పోలవరం ప్రాజెక్ట్. దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎలా మిగిలిపోతుందో పోలవరం ప్రాజెక్టు కూడా ఆ విధంగానే ఆగిపోతూ వస్తోంది. 1941లో ఆనాటి నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఎల్ వెంకటకృష్ణ పోలవరం ప్రాజెక్ట్‌కు ప్రతిపాదనలు చేశారు. ఆ టైంలో దీని పేరు రామపాద సాగర్ అని పెట్టారు. అప్పుడు 129 కోట్ల వ్యయంతో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నోచుకోలేదు. 1953లో మరోసారి గోదావరి జలాలు విపరీతంగా వచ్చాయి చాలా నీరు వృధాగా సముద్రంలోకి వెళ్ళింది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కు నీరు అవసరం వచ్చింది ఈ సమయంలో కూడా ప్రాజెక్టు మళ్ళీ కట్టాలనుకున్నారు.

పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ప్రాజెక్ట్ పలు రాజకీయ ఆర్థిక కారణాల చేత అప్పుడు కూడా కార్యాచరణ దాల్చలేదు. ఇక 1976లో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కొత్త ప్రతిపాదనలు వచ్చాయి. 1981 లో నాటి సీఎం అంజయ్య ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1985, 86 లో దీని వ్యయం 2 వేల 665 కోట్లు అంచనా వేశారు. అయినా ముందడుగు పడలేదు. ఇక 1994లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆయన ఎక్కువగా ఐటివైపు దృష్టి పెట్టి, ప్రాజెక్టును మరిచిపోయారు. ఆ తర్వాత 2004లో కాస్త కదలిక వచ్చింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి దీన్ని నిర్మాణాన్ని ప్రారంభించి కాస్త ముందుకు తీసుకెళ్లారు. అన్ని అనుమతులు వచ్చాయి. కానీ, చివరికి 2009లో అనుకోకుండా వైయస్సార్ మరణంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది.

2014లో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని ప్రాజెక్టును పూర్తి చేయడానికి పోలవరం అథారిటీ ప్రాజెక్టు అనే కమిటీని వేయించారు. పనులు ప్రారంభమైన అది పూర్తికాలేదు. తర్వాత 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. ఈయన కూడా ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదు. చివరికి చంద్రబాబు మళ్ళీ ఈ ప్రాజెక్టుకు దిక్కయ్యారు. 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికారిక హోదాలో మొదటి పర్యటనగా పోలవరం ప్రాజెక్టు‌ను సందర్శించారు.

ఈ ప్రాజెక్టుకు ప్రతిసారి బడ్జెట్ సమస్య లేదంటే పర్యావరణ అనుమతుల ప్రాబ్లం ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. కానీ ఈసారి కేంద్రం చంద్రబాబుకు అండగా ఉంది కాబట్టి 4 సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రతి మూడో సోమవారం పోలవరం గురించి తప్పకుండా సమీక్ష చేస్తానన్నారు. ఈ సారి తన ప్రభుత్వం కాలపరిమితి ముగిసే లోపే పోలవం ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరి చందబ్రాబు హయాంలో ప్రాజెక్టు పూర్తవుతుందా లేదా మళ్లీ ఆగిపోతుందా వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories