AP Election Result: వైసీపీ ఓటమికి కారణం ఇదేనా..?

Why YCP Failed So Badly
x

AP Election Result: వైసీపీ ఓటమికి కారణం ఇదేనా..?

Highlights

Jagan: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. ఫ్యాన్‌కు బై బై చెప్పి కూటమికే జై కొట్టారు ఏపీ ప్రజలు.

Jagan: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. ఫ్యాన్‌కు బై బై చెప్పి కూటమికే జై కొట్టారు ఏపీ ప్రజలు. కూటమి దూకుడు ముందు ఏమాత్రం నిలువలేకపోయింది ఫ్యాన్ పార్టీ. వైసీపీ భారీ ఆశలు పెట్టుకున్న రాయలసీమ, ఉత్తరాంధ్రలోనూ జగన్‌ అంచనాలు తలక్రిందులు అయ్యాయి. ఇక కృష్ణా, గుంటూరు, కోన సీమ జిల్లాలో అయితే వైసీపీ బొక్కబోర్లా పడింది. జగన్ అంచనాలు ఎందుకిలా తారుమారు అయ్యాయి. రాయలసీమ ప్రజలు ఎందుకు మరోసారి ఆధరించలేదు. మూడు రాజధానుల ప్రయోగం వికటించిందా..?

వార్ వన్ సైడ్ అయ్యింది. ఏపీలో కూటమి దండయాత్ర కొనసాగింది. టీడీపీ, జనసేన, బీజేపీలు కుమ్మేశాయి. సీట్ల సునామీ సృష్టించాయి. ఏ కోవలోనూ కూటమికి పోటీ ఇవ్వలేక చతికిలబడింది వైసీపీ. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన టైం నుంచే.. పూర్తిస్థాయిలో ఆధిక్యతను కొనసాగిస్తూ అధికార పీఠానికి చేరువైంది కూటమి. ఎగ్జిట్ పోల్స్‌లో భిన్న అంచనాలు వెల్లడికావడంతో వైసీపీ, కూటమి మధ్య క్లోజ్‌ ఫైట్ ఉంటుందనున్నారు అంతా. కానీ పొలిటికల్ విశ్లేషకుల అంచనాలు సైతం తలక్రిందులు అయ్యేలా.. కూటమి జోరు చూపించింది. రాయలసీమ నుంచి మొదలుపెడితే.. దక్షిణ కోస్తా, ఉమ్మడి కృష్ణా, గుంటూరు, కోన సీమ జిల్లాలతో పాటు.. ఉత్తరాంధ్రలోనూ కూటమికే పట్టం కట్టారు ఏపీ ప్రజలు. వైనాట్ 175తో బరిలో దిగిన జగన్‌ అండ్ కోకు.. కలలో కూడా ఊహించని షాక్ తగిలింది.

ఐతే వైసీపీ పరాజయంలో అనేక ఫ్యాక్టర్లు పని చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వైఎస్ జగన్.. మూడు రాజధానుల ప్రయోగం ఘోరంగా వికటించినట్టు కనిపిస్తోంది. రాజధాని అమరావతి తరలింపు నిర్ణయానికి వ్యతిరేకంగా కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రజలు ఇలా ఓట్ల రూపంలో తమ నిరసనను వ్యక్తపరిచినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఈ ఎన్నికల్లో సంక్షేమాన్ని నమ్ముకుని ప్రజల్లోకి వెళ్లారు జగన్. మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు వేయమని కోరారు. ఐతే సంక్షేమ పథకాల కంటే.. రాజధాని అంశం, అభివృద్ధి అజెండానే జనం మార్పు కోరుకున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వైసీపీకి అడ్డగా చెప్పుకునే రాయలసీమలోనూ ఈసారి వైసీపీకి.. ‎ఎదురుగాలే వీచింది. గతనానికి భిన్నంగా ఊహించని తీర్పును ఇచ్చారు సీమ ప్రజలు. జగన్‌కు చెందిన రెడ్డి సామాజిక వర్గంతో పాటు ముస్లిం మైనార్టీ ఓట్లు భారీగా ఉన్నా.. ఆ సోషల్ ఇంజనీరింగ్‌ పెద్దగా పని చేయలేదు. సీమలో 52 సీట్లకు గాను వైసీపీ కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 49 సీట్లు కట్టబెట్టిన సీమ ఓటర్లు..ఈసారి అందరి అంచనాలను తారుమారు చేస్తూ కూటమికి మొగ్గు చూపారు. సీమలో అనుకున్నంత స్థాయిలో సాగు నీటి పథకాలు పూర్తి కాకపోవడం, రాజధాని తమకు దూరంగా వెళ్లిపోతుందనే అభిప్రాయాలతో పాటు అభివృ‌ద్ధి, నిరుద్యోగం, పరిశ్రమలు తరలిపోవడం వంటి ఫ్యాక్టర్స్ బాగా పనిచేసినట్టు తెలుస్తోంది.

ఏపీ రాజకీయాలకు పవర్ సెంటర్‌గా భావించే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ పూర్తిగా తుడుచుపెట్టుకపోయింది. ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ సీటును గెలుచుకోలేకపోయింది. ఇక్కడ కేపిటల్ తరలింపు నిర్ణయం వైసీపీని తీవ్రంగా దెబ్బకొట్టింది. రాజధాని తమకు కాకుండా పోతుందనే ఆందోళన, అమరావతి రైతుల నిరసనలు ఫ్యాన్‌ స్పీడ్‌కు బ్రేక్‌లు వేశాయి. ఉమ్మడి కృష్ణాలో 16 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే.. ఒక్కరు కూడా ప్రభావం చూపలేకపోయారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17అసెంబ్లీ సీట్లు ఉంటే.. అక్కడ కూటమి అభ్యర్థులే క్లీన్‌ స్వీప్ చేశారు.

ఉభయగోదారి జిల్లాలోపూ ఈసారి వైసీపీ పూర్తిగా చతికిలబడిపోయింది. సింగిల్‌ సీటును కూడా ఖాతాలో వేసుకోలేకపోయారు జగన్. ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో మొత్తం 34అసెంబ్లీ స్తానాలు ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీ హవా నడిస్తే.. ఆ పార్టీదే అధికారం అనే నానుడి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోనసీమ జిల్లాలపై పూర్తి ఆధిక్యత కనబర్చిన వైసీపీ ఈసారి చేతులు ఎత్తేసింది. టీడీపీ, జనసేన జోరులో కొట్టుకపోయింది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. సామాజిక వర్గం ఈ ప్రాంతంలో అధికంగా ఉండటం కూటమికి ప్లస్ అయ్యింది. కాపు ఓటర్లు పోలరైజ్‌ అయ్యి.. కూటమికి వెన్నుదన్నుగా నిలిచారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడం, నిర్వాసితులకు పరిహారం విషయంలో వైసీపీకి ఎదురుగాలి వీచింది. ఉమ్మడి గోదావరి జిల్లాలో 34సీట్లను కూడా.. అన్నింటిని కూటమినే దక్కించుకుంది.

ఉత్తరాంధ్రలోనూ వైసీపీకీ ఏమాత్రం ఊరట దక్కలేదు. విశాఖకు రాజధాని తరలింపు అంశం వైసీపీకి ఏ స్థాయిలోనూ లాభం చేకూర్చలేకపోయింది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, విశాఖను దేశంలోనే నెంబర్ వన్ కేపిటల్‌గా చేస్తామని జగన్ అండ్ కో ఎంత చెప్పినా అక్కడి ప్రజలు సపోర్ట్‌గా నిలువలేదు. విశాఖ, విజయనగరం, సిక్కోలు జిల్లాలో వైసీపీ కేవలం రెండు సీట్లకే పరిమితం అయ్యింది. మొత్తానికి ఉత్తరాంధ్రలో టీడీపీ తిరిగి తన పట్టును నిలుపుకుని.. కూటమితో కలిసి అధికారం ఛేజిక్కించుకుంది. వైసీపీ ప్రజా వ్యతిరేకతను కూటమి తమ వైపునకు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యింది.

Show Full Article
Print Article
Next Story
More Stories