ఢిల్లీ నుంచి పవన్‌‌కు మళ్లీ కాల్‌ ఎందుకు వచ్చింది?

ఢిల్లీ నుంచి పవన్‌‌కు మళ్లీ కాల్‌ ఎందుకు వచ్చింది?
x
Highlights

పవన్‌ కల్యాణ్‌ మొన్ననే ఢిల్లీ వెళ్లొచ్చారు. ఇప్పుడు మళ్లీ ఢిల్లీ పిలుపొచ్చింది. మరి ఈసారి జనసేనానిని, కమలం పెద్దలు ఎందుకు పిలిచారు? పవన్ ఢిల్లీ...

పవన్‌ కల్యాణ్‌ మొన్ననే ఢిల్లీ వెళ్లొచ్చారు. ఇప్పుడు మళ్లీ ఢిల్లీ పిలుపొచ్చింది. మరి ఈసారి జనసేనానిని, కమలం పెద్దలు ఎందుకు పిలిచారు? పవన్ ఢిల్లీ టూర్‌పై ఎలాంటి చర్చ జరుగుతోంది.

అటు సినిమా షూటింగ్‌‌లు ఇటు అమరావతి ఉద్యమం - మధ్యలో మరోసారి హస్తిన పిలుపు - ఢిల్లీ నుంచి పవన్‌‌కు మళ్లీ కాల్‌ ఎందుకు వచ్చింది?

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, సినిమా షూటింగ్‌లకు క్లాప్‌ కొట్టారు. హిందీలో మంచి విజయం సాధించిన పింక్‌ సినిమా రీమేక్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు పవన్. వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రోజే, పింక్ షూటింగ్‌ మొదలైంది. ఆ రోజు సాయంత్రమే అమరావతి ఆందోళనల్లో పాల్గొన్నారు పవన్. పింక్‌ సినిమా షూటింగ్‌ సాగుతుండగానే, క్రిష్‌ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు పవన్. ఈ మూవీ షూటింగ్‌ కూడా రీసెంట్‌గా మొదలైంది.

ఇలా సినిమా షూటింగ్‌లు, అలా అమరావతిపై అప్పుడప్పుడు ఆందోళనలు, కొన్ని ట్వీట్లు, అటు పార్టీ నిర్మాణం, ఇంకోవైపు బీజేపీ ఉమ్మడి కార్యాచరణపై కసరత్తు. ఇలా క్షణం తీరికలేకుండా, గడియారం ముల్లుతో పోటీ అన్నట్టుగా బిజిబిజీగా మారిపోయారు పవన్ కల్యాణ్. ఇలాంటి తీరికలేని టైంలోనే, ఢిల్లీ బీజేపీ నుంచి పవన్‌కు మళ్లీ కాల్‌ వచ్చిందట. అదే ఇప్పుడు, రాజకీయవర్గాల్లో హాట్‌హాట్‌ టాపిక్‌. మొన్ననే ఢిల్లీకి వెళ్లి మూడు రాజధానులపై కేంద్రానికి నివేదించి, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కూ వినతీపత్రమిచ్చి, బీజేపీ అధ్యక్షుడిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన నడ్డాను కలిసొచ్చిన పవన్‌కు, అంతలోనే మళ్లీ పిలుపెందుకొచ్చిందన్న చర్చ జరుగుతోంది.

అయితే ఈసారి పిలుపుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యముందట. హస్తిన శాసన సభ సమరంలో కేజ్రీవాల్‌ను ఢీకొట్టలేక సతమతమవుతున్న, మోడీ, అమిత్‌ షాలు, అన్ని ఆయుధాలనూ ప్రయోగిస్తున్నట్టే, పవన్‌నూ ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే సైనా నెహ్వాల్‌ను పార్టీలోకి ఆహ్వానించి, ప్రచారానికి సిద్దం చేస్తున్నారు. ఇంకొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రీడాకారులను సైతం క్యాంపెయిన్‌కు పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్‌నూ రారమ్మంటోంది బీజేపీ.

ఢిల్లీలో తెలుగువారి జనాభా బాగానే వుంది. ఇక కన్నడ, తమిళ, కేరళ రాష్ట్రాల ప్రజలూ మంచి సంఖ్యలోనే వున్నారు. సౌతిండియాలో పాపులర్‌ హీరో అయిన పవన్‌ కల్యాణ్‌‌తో ఢిల్లీ ప్రచారం చేయిస్తే, బాగుంటుందని భావిస్తున్నారట బీజేపీ నేతలు. దక్షిణాది ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో క్యాంపెయిన్‌ చేయించేందుకు షెడ్యూల్‌ సెట్‌ చేస్తున్నారట. జనసేన-బీజేపీ జతకట్టిన నేపథ్యంలో, ఉమ్మడి కార్యాచరణపై కసరత్తు చేస్తున్నారు రెండు పార్టీల నేతలు. అమరావతిలో రెండుపార్టీలూ కలిసి లాంగ్‌ మార్చ్‌ నిర్వహించాలని తలపెట్టినా, ఎందుకనో వాయిదా పడింది.

మూడు రాజధానులపై కేంద్రం సుముఖంగా లేదని పవన్‌ ప్రకటించడం, అయితే, కేంద్రానికి ఎలాంటి సంబంధంలేదని జీవీఎల్‌ అనడంపై, ఇప్పటికీ రాద్దాంతం జరుగుతూనే వుంది. ఎవరు చెప్పింది నిజమనుకోవాలో అర్థంకాక జనసైనికులు తికమకపడుతున్నారు. మొత్తానికి అటు సినిమా షూటింగ్‌లు, ఇటు అమరావతి నిరసనలు, పార్టీ నిర్మాణంపై తీరికలేకుండా ముందుకెళుతున్న పవన్‌, ఢిల్లీ ఎన్నికల ప్రచారానికీ డేట్స్ ఇస్తున్నారు. మొత్తానికి పవన్‌ కల్యాణ్‌ బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే హస్తిన ఎన్నికల ప్రచారమేనా, రెండు పార్టీలకు సంబంధించి ఇంకా కీలకమైన చర్చలు, అధిష్టాన పెద్దలతో చేస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories