సజ్జల విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకుంటారా?

Whats in YS Jagans Mind Over Sajjala Ramakrishna Reddy
x

సజ్జల విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకుంటారా?

Highlights

Sajjala Ramakrishna Reddy: సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకుంటారా?

Sajjala Ramakrishna Reddy: సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకుంటారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఆ డిసిషన్‌ ఏంట? తనకు అత్యంత నమ్మకంగా ఉన్న సజ్జలను వదులుకునేందుకు ఇష్టపడని జగన్ ఆయనకు రాజకీయంగా ఓ పదవి కట్టబెట్టాలని చూస్తున్నారా? అప్పగించే ఆ బాధ్యత ఏంటి పరువు నిలబెట్టే ఆ పదవి ఏంటి?

వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చుట్టూ కొన్ని విమర్శలు, అదే సమయంలో కొన్ని ఆరోపణలు ముసురుకుంటున్నాయి. అందుకే త్వరలోనే సజ్జలపై సీఎం ఓ నిర్ణయం తీసుకునే వీలుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను మీడియా ముఖంగా సమర్థిస్తూ వచ్చారు. మరోవైపు వైఎస్సార్సీపీ రాజకీయ ప్రత్యర్థులపై ఆయన విమర్శలూ చేస్తున్నారు.

దీంతో ఇటీవల హైకోర్టు సలహాదారుల విధులు ఏమిటీ? వాళ్లు రాజకీయాలు మాట్లాడొచ్చా? అని ప్రశ్నించి సలహాదారుల విధివిధానాలపై ప్రభుత్వం నుంచి స్పష్టతను కోరింది. దీంతో ఇదే అదనుగా సజ్జలను ప్రత్యర్థి పార్టీలు వైసీపీ లక్ష్యంగా చేసుకుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయన షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలూ వచ్చాయి.

సజ్జల తీరు ఇలాగే కొనసాగితే ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సజ్జలపై ప్రత్యేక దృష్టి సారించిన జగన్ ఆయనను మండలికి పంపించి నేరుగా రాజకీయాల్లోకి తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఆ దిశగా సీఎం జగన్ ఇప్పటికే కసరత్తులు పూర్తి చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శాసనమండలిలో త్వరలో జరగనున్న భర్తీల్లో భాగంగా సజ్జలకు అవకాశం ఇచ్చి ఆ తర్వాత మంత్రి పదవి కట్టబెట్టినా ఆశ్చర్యం లేదని అనుకుంటున్నారు. మంచి విషయ పరిజ్ణానం ఉన్న సజ్జల ప్రభుత్వానికి అదనపు బలంగా మారే అవకాశముంది ఉంది అంటున్నారు వైసీపీలో కొంత మంది నేతలు.

ప్రస్తుతం అధికార పార్టీ తరపున కానీ ప్రభుత్వం తరపున కానీ గట్టిగా మాట్లాడేవాళ్లు ఎవరూ లేకపోవడం ఇబ్బందిగా మారింది. నోటికి ఎంతోస్తే అంతే మాట్లాడే నాయకులున్న పార్టీలో ఆచితూచి వివాదాలకు తావివ్వకుండా మాట్లాడే సజ్జలలాంటి నాయకుల అవసరం ఉందని సీఎం జగన్ భావిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డికి మరింత ప్రాధాన్యం ఇస్తే విమర్శకులకు చెక్ పెట్టొచ్చన్నది జగన్‌ ఆలోచనట. చూడాలి మరి. జగన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో సజ్జలకు ఏ పదవి కట్టబెడుతారో!!

Show Full Article
Print Article
Next Story
More Stories