ఏపీ శాసనమండలి చరిత్రలో తొలిసారి రూల్ 71 తీర్మానం.. అసలు రూల్ 71 అంటే ఏంటీ ?

ఏపీ శాసనమండలి చరిత్రలో తొలిసారి రూల్ 71 తీర్మానం.. అసలు రూల్ 71 అంటే ఏంటీ ?
x
Highlights

ఏపీ శాసనమండలిలో రూల్ 71 అధికార పక్షాన్ని ఇరుకున పెట్టింది ప్రతిపక్షం టీడీపీ. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న దూకుడుకు అడ్డుకట్ట వేసింది....

ఏపీ శాసనమండలిలో రూల్ 71 అధికార పక్షాన్ని ఇరుకున పెట్టింది ప్రతిపక్షం టీడీపీ. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న దూకుడుకు అడ్డుకట్ట వేసింది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఎ ఉపసంహరణ బిల్లులును వ్యతిరేకిస్తూ టీడీపీ రూల్ 71 కింద తీర్మానం ప్రవేశపెట్టింది. రాజధాని మార్పుపై చర్చించాలని బిల్లును తిరస్కరించాలని కోరింది. అసలు రూల్ 71 అంటే ఏంటీ అధికార పక్షాన్ని ఏవిధంగా అడ్డుకోగలిగింది. బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేయబోతున్న తరుణంలో వైసీపీ ఏం నిర్ణయం తీసుకోబోతుందన్నది సర్వత్రా ఆసక్తిని కల్గిస్తుంది.

శాసనమండలిలో ఇవాళ ఏం జరగబోతుంది..? ఏపీ శాసనమండలి చరిత్రలో తొలిసారి రూల్ 71 తీర్మానం ప్రవేశపెట్టింది టీడీపీ. ప్రభుత్వంలోని ఏదైనా మంత్రిత్వ శాఖ తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని వ్యతిరేకించే అధికారం ఈ నిబంధన శాసనమండలి సభ్యులకు ఇస్తుంది. ఇప్పటి వరు ఈ నిబంధనను ఎవరూ ఉపయోగించుకోలేదని అసెంబ్లీ రికార్డులు చెబుతున్నాయి. అయితే సభా కార్యాకలాపాలు ప్రారంభం కావడానికి ముందే ఈ తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరాలి. సంబంధిత తీర్మానాన్ని లిఖిత పూర్వక నోటీసు రూపంలో మండలి కార్యదర్శికి అందచేయాల్సి ఉంటుంది.

రూల్ 71 నిబంధనలకు అనుగుణంగా ఉందని చైర్మన్ భావిస్తే సభలో చదివి మిగతా సభ్యులకు వినిపిస్తారు. ఎంతమంది మద్దతు ఇస్తున్నారో ఆయా సభ్యులు సభలో తమతమ స్థానాల్లో నిలబడాలని కోరుతారు. ఒక వేళ తీర్మానం నోటిసుకు అనుకులంగా 20 మంది లేదా అంతకు మించి సభ్యులు అనుకూలంగా ఉంటే సదరు తీర్మానాన్ని చర్చకు స్వీకరించాలనే నిబంధన రూల్ 71 కిందకు వస్తుంది.

మూడింట రెండొంతుల సభ్యుల బలం ఉంటే రూల్ 71 కింద సభ్యులు నోటీసు ఇచ్చే అధికారం ఉండటంతో టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు మండలిలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుపై మండలిలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బిల్లను చర్చకు స్వీకరించి మండలి వ్యతిరేకిస్తే ఆ బిల్లు తిరిగి అసెంబ్లీకి వెళుతుంది. నిబంధనల ప్రకారం రెండోసారి అదే బిల్లును అసెంబ్లీ ఆమోదిస్తే మళ్లీ శాసనమండలికి వెళుతుంది. రెండో సారి కూడా మండలి బిల్లును తిరస్కరిస్తే నిబంధనల బిల్లు ఆమోదం పొందినట్లుగానే పరిగణిస్తారు. గవర్నర్ ఆమోదం లభించిన తర్వాత చట్టంగా మారుతుంది.

నిబంధనల ప్రకారం ముందుగా రూల్ 71 తీర్మానంపై చర్చ నిర్వహించిన ఛైర్మన్ మండలిని వాయిదా వేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులపై మండలిలో ఇవాళ చర్చ జరగనుంది. బిల్లును వ్యతిరేకిస్తున్న టీడీపీ పట్ల వైసీపీ ఏం చేస్తుంది మండలి రద్దు చేస్తే వికేంద్రీకరణ బిల్లుకు మరింత సమయం పడుతుండటంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది రాజకీవర్గాల్లో ఆసక్తిని కల్గిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories