నిర్మించబోయేది ఇళ్లు కాదు ఊళ్లు:ఏపీ సీఎం జగన్

నిర్మించబోయేది ఇళ్లు కాదు ఊళ్లు:ఏపీ సీఎం జగన్
x
Highlights

నిర్మించబోయేది ఇళ్లు కాదు ఊళ్లు అన్నారు ఏపీ సీఎం జగన్. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కొందరు...

నిర్మించబోయేది ఇళ్లు కాదు ఊళ్లు అన్నారు ఏపీ సీఎం జగన్. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కొందరు ఓర్చులేకపోతున్నారంటూ టీడీపీపై విమర్శలు గుప్పించారు.

రాష్ట్రంలో 15రోజుల పాటు ఇళ్ల పండుగ జరగబోతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. క్రిస్మస్‌, వైకుంఠ ఏకాదశి పర్వదినాన రాష్ట్రవ్యాప్తంగా 30.75 లక్షల ఇళ్లస్థలాల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టామన్నారు. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో పైలాన్‌ను ఆవిష్కరించారు. 28.30లక్షల ఇళ్లకు రెండు దశల్లో 50వేల 940కోట్లు ఖర్చు చేయబోతున్నామని... మొదటి దశ కింద 15.60 లక్షల గృహాలకు 28వేల కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. 2.62లక్షల టిడ్కో ఇళ్లను అక్కచెల్లెమ్మల పేరిట సేల్‌ అగ్రిమెంట్‌ చేయనున్నామని.. రాబోయేవి కాలనీలు కాదు.. ఏకంగా ఊళ్లేనని సీఎం జగన్ అన్నారు.

పాదయాత్ర ప్రతి అడుగులోనూ పేదల కష్టాలు చూశానని.. కొన్ని వర్గాలు నివసించేందుకు వసతి సదుపాయం లేక ఏ పరిస్థితుల్లో జీవితాన్ని గడుపుతున్నారో గమనించాని జగన్ అన్నారు. అందుకే ఎన్నికల మేనిఫెస్టోలో ఇళ్ల పట్టాల అంశాన్ని చేర్చామని... మేనిఫెస్టో తమకు భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌తో సమానమని.. దాన్ని అమలు చేయడానికి అహర్నిశలు శ్రమిస్తానని మొదటి నుంచి చెప్తున్నానని జగన్ అన్నారు.

ఇళ్ల స్థలాల పంపిణీ సందర్భంగా టీడీపీపై జగన్ విమర్శలు గుప్పించారు. పేదలకు ఇంటిస్థలాలు ఇస్తుంటే కొందరు ఓర్వలేకపోతున్నారన్న ఆయన... పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని కోర్టులో పిల్‌ వేశారని అన్నారు. అన్నివర్గాలకు మేలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని... ఇప్పుడు అందని మిగతావారికి త్వరలోనే పట్టాలు అందిస్తామని చెప్పారు.

ఇప్పుడు ఇళ్లు కాదు.. ఊళ్లు కడుతున్నామన్న జగన్... రాష్ట్రవ్యాప్తంగా 17వేలకు పైగా కాలనీలు రాబోతున్నాయని చెప్పారు. ఇంటి స్థలాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని... దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో పరిశీలించి మంజూరు చేస్తామని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories