విజయవాడ ఇంద్రకీలాద్రిపై కూలిన గోడ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కూలిన గోడ
x
Highlights

విజయవాడ దుర్గ గుడికి వెళ్లే భక్తులను వరుస ప్రమాదాలు భయపెడుతున్నాయి. తాజాగా దుర్గ గుడి ఆవరణలో ఉన్న గోడ కూలిపోవడం సంచలనం కలిగించింది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.

విజయవాడ దుర్గ గుడికి వెళ్లే భక్తులను వరుస ప్రమాదాలు భయపెడుతున్నాయి. తాజాగా దుర్గ గుడి ఆవరణలో ఉన్న గోడ కూలిపోవడం సంచలనం కలిగించింది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. పాత కాలపునాటి గోడ కావడం, ఇటీవల కురిసిన వర్షాలకు తడిసి ఉండడంతో గోడ కూలిందని అధికారులు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా శిధిలావస్థకు చేరుకున్నా అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక ఇటివల దసరా నవరాత్రుల సమయంలో ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే.. అయితే ఈ ప్రమాదములో పలువురు గాయపడ్డారు..అంతేకాకుండా ఓ రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. కొండచరియలు విరిగిన ప్రాంతాన్ని సీఎం జగన్‌ పరిశీలించారు. దుర్గగుడి అభివృద్ధి,కి గాను జగన్ రూ.70 కోట్లు ప్రకటించారని ఆలయ చైర్మన్‌ పైలా సోమినాయుడు పేర్కొన్నారు. ఇది జరిగిన కొద్దిరోజుల్లోనే మళ్లీ గోడకూలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories