రాష్ట్రవ్యాప్తంగా ఏపీ వాలంటీర్ల ఆందోళన

volunteers Concern Across the Andhra Pradesh State
x

Andhra Pradesh volunteers

Highlights

* జిల్లాల్లోని కలెక్టరేట్ల ఎదుట వాలంటీర్ల ధర్నా * కడప కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలో పాల్గొన్న వాలంటీర్లు * కనీస వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్

రాష్ట్రవ్యాప్తంగా యూనిటీ ఆఫ్ ఏపీ వాలంటీర్లు ఆందోళన బాట పట్టారు. జిల్లాల్లోని కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు దిగారు. సీఎం సొంత జిల్లా కడప కలెక్టరేట్‌ ఎదుట పెద్దఎత్తున వాలంటీర్లు ధర్నాలో పాల్గొని న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల ఆందోళనకు ఏఐటీయూసీ మద్దతు తెలిపింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించి వారికి కనీస వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ నాయకులు తెలిపారు. వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories