విశాఖలో పర్యాటక ప్రాంతాలకు కరోనా ఎఫెక్ట్.. పర్యాటకులు రాకపోవడంతో..

విశాఖలో పర్యాటక ప్రాంతాలకు కరోనా ఎఫెక్ట్.. పర్యాటకులు రాకపోవడంతో..
x
Highlights

సుందరమైన సందర్శనీయ స్థలాలకు నెలవు విశాఖ. పర్యాటకులతో కళ కళలాడే ప్రాంతాలన్ని కళ తప్పాయి. కరోనా కల్లోలానికి ఆగమయ్యాయి. ప్రభుత్వం చాలా ఆదాయం కోల్పోవలసి...

సుందరమైన సందర్శనీయ స్థలాలకు నెలవు విశాఖ. పర్యాటకులతో కళ కళలాడే ప్రాంతాలన్ని కళ తప్పాయి. కరోనా కల్లోలానికి ఆగమయ్యాయి. ప్రభుత్వం చాలా ఆదాయం కోల్పోవలసి వచ్చింది. కానీ ఐదు నెలల విరామం తర్వాత మళ్లీ తెరుచుకున్నాయి ఇప్పుడిప్పడే పుంజుకుంటున్నాయి. లాక్‌డౌన్ తర్వాత విశాఖలో ప్రారంభమైన పర్యాటకం గురించి హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.

కరోనా వల్ల పర్యాటక ప్రాంతాలను మూసివేసిన రాష్ట్ర ప్రభుత్వం ఐదు నెలల తరువాత మళ్లీ ప్రారంభించింది. బొర్రా గుహలు, చాపరాయి, తాడిగుడ జలపాతం, అరకు మ్యూజియం, పద్మాపురం గార్డెన్స్ వంటివి తెరిచారు. అయితే బోటింగ్ వంటి స్పోర్ట్స్‌కు అంతంత మాత్రంగానే ఆదరణ కనిపిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి ప్రజా రవాణా సదుపాయాలు పెద్డగా లేనందున పర్యాటకుల సంఖ్య తక్కువుగానే ఉంది. బొర్రాలో అయితే రోజుకు సీజన్‌లో మూడు వేల మంది వస్తుంటారు. కానీ ప్రస్తుతం రెండు వందల నుంచి మూడు వందల మంది మాత్రమే వస్తున్నారు.

విశాఖ నగరంలోని కైలాసగిరి, తొట్లకొండ, వైఎస్ ఆర్ సీటీ సెంట్రల్ పార్క్‌లను కూడా తెరిచారు. అయితే కైలాసగిరి రోప్ వే, టీయూ 142 మ్యూజియం, కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం ఇంకా తెరవలేదు. అక్టోబరు నుంచి సందడి మొదలవుతందని పర్యాటక వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఏటా సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చేవారు. కానీ ఈ సంవత్సరం కరోనా వల్ల ఎవరూ రాలేదు. గత ఏడాది అంత లేకపోయినా కొంతవరకైనా బాగుంటుందని పర్యాటక అధికారులు ఆశిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories