ఉధృతమవుతోన్న విశాఖ ఉక్కు పోరాటం

Visakhapatnam Steel plant Privatization Protest
x

file Image 

Highlights

* ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్షలకు సిద్ధమైన కార్మికులు * ఇవాళ్టి నుంచి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు * ప్రత్యక్ష ఆందోళనలోకి ప్లాంటు నిర్వాసితులు

శాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం ఉధృతమవుతోంది. ఓ వైపు కార్మిక సంఘాలతో పాటు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి. ఇవాళ్టి నుంచి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభం అవనున్నాయి. అటు ప్లాంటు నిర్వాసితులు కూడా ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టారు. నేటితో ఆయన నిరాహార దీక్ష మూడు రోజులకు చేరింది. ఇవాళ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆయన్ను పరామర్శించనున్నారు. మరోవైపు మాజీ మంత్రి గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ పంపడానికి సిద్ధమయ్యారు. గతంలో పంపిన ఓసారి రాజీనామ లేఖ పంపిన ఆయన.. ఇవాళ స్పీకర్ ఫార్మాట్ లో రిజైన్ చేయనున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories