వేసవిలో నీటికోసం అల్లాడే బర్డ్స్ దాహం తీరుస్తున్న యువత.. చిన్న ప్రయోగంతో సక్సెస్...

Visakha Young People Team Quenching Birds Thirst from 10 Years Through Ken Foundation | Live News
x

వేసవిలో నీటికోసం అల్లాడే బర్డ్స్ దాహం తీరుస్తున్న యువత.. చిన్న ప్రయోగంతో సక్సెస్...

Highlights

Summer - Birds Thirst: కెన్ ఫౌండేషన్‌గా ఏర్పడి వాటర్ బౌల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన బృందం సభ్యులు...

Summer - Birds Thirst: వేసవి వచ్చిందంటే నీటి కోసం అల్లాడిపోతాం. కాలు బయటపెడితే కాసిన్ని నీళ్లు ఎక్కడ దొరుకుతాయాని ఆశ పడతాం. ఎప్పటికప్పుడు దాహన్ని తీర్చుకునేందుకు తహతహలాడుతాం. అందుకు జనం కోసమైతే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు.... మరి మూగజీవాల పరిస్థితి ఏంటని ఆలోచించింది ఓ యువ బృందం. వాటి దాహం తీర్చే మార్గం అన్వేషించింది. చిన్న ప్రయోగంతో సక్సెస్‌ అయ్యి పదేళ్లుగా బర్డ్స్ దాహం తీరుస్తున్న వైనంపై హెచ్ఎం టీవీ స్పెషల్ రిపోర్ట్...

చుక్క నీటి కోసం మైళ్ల దూరం ప్రయాణిస్తూ పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. పక్షి జాతుల్లో కొన్ని అంతరించిపోవడానికి వేసవి ఒక కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. పక్షుల శరీర సాధారణ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్. ఈ ఉష్ణోగ్రత దాటితే ఎక్కువ సేపు జీవించలేవు. అందుకే చాలా పక్షులు ఎక్కడ నీరు కనిపిస్తే అక్కడ మునిగి తేలుతుంటాయి. ఇక వేసవిలో వాటి పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గుక్కుడు నీటి కోసం తహతహలాడుతుంటాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని ఆలోచించింది విశాఖకు చెందిన ఓ బృందం. విశాఖ నగరంలో వేలాది పశుపక్ష్యాదుల దాహార్తిని తీర్చేందుకు ఓ అడుగు ముందుకేసింది. పక్షుల సంరక్షణకు నడుంబిగించింది. కెన్ ఫౌండేషన్‌గా ఏర్పడి వాటర్ బౌల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. పక్షులను వేసవి తాపం నుంచి రక్షించి, దాహార్తిని తీర్చే ఉద్దేశంతో ముందుకు వచ్చిన బృందం తొలి ఏడాదిలో 100 నీటి తొట్టెలు ఏర్పాటు చేసింది.

అప్పటి నుండి ప్రతీ సంవత్సరం రెండు వందల నీటి తొట్టెలకు తగ్గకుండా వివిధ వర్గాల వారికి ఉచితంగా పంపిణీ చేస్తుంది. దీంతో పిచ్చుకలు, రామచిలుకలు, పావురాలు, కోయిలలు, కాకులతో పాటు ఉడుతలు, ఆవులు, కుక్కలు కూడా ఈ వాటర్ బౌల్స్ వద్దకు చేరుకుని తమ దాహార్తిని తీర్చుకుంటున్నాయి. ఇలా వేసవిలో పక్షుల దాహం తీర్చేందుకు ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ బృందం సభ్యులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories