కంటితుడుపుగా మిగిలిపోయిన విశాఖ రైల్వే జోన్ ప్రకటన

కంటితుడుపుగా మిగిలిపోయిన విశాఖ రైల్వే జోన్ ప్రకటన
x
Highlights

ఉత్తరాంధ్రుల సుదీర్ఘ పోరాటం విశాఖ రైల్వే జోన్‌ ప్రకటన. ఫలితంగా పొరుగురాష్ట్రానికి తరలిపోయినా వాల్తేరు డివిజన్ ఆదాయం. అటు జోన్‌కు నిధుల కేటాయింపులు...

ఉత్తరాంధ్రుల సుదీర్ఘ పోరాటం విశాఖ రైల్వే జోన్‌ ప్రకటన. ఫలితంగా పొరుగురాష్ట్రానికి తరలిపోయినా వాల్తేరు డివిజన్ ఆదాయం. అటు జోన్‌కు నిధుల కేటాయింపులు కంటితుడువు చర్యగానే మిగిలింది. దీనికి తోడు కేంద్ర రైల్వే మంత్రి జోన్స్‌ కుదింపు అంటూ ప్రకటనలు. దీంతో మరోసారి ఉత్తరాంధ్రలో రైల్వే జోనం అంశం చర్చనీయాంశం అవుతుంది.

నాలుగు దశాబ్ధాల పోరాటం విభజన చట్టంలో విశాఖ ప్రత్యేక రైల్వే జోన్‌ అంశం దీంతో 2019 ఎన్నికల ముందే విశాఖకు రైల్వే జోన్ ప్రకటిస్తూ కేంద్రం ప్రకటన చేసింది. అయితే 7వేల 300కోట్ల రూపాయల ఆదాయం అందుతున్న వాల్తేరు డివిజన్‌ను పొరుగు రాష్ట్రంలో సగభాగం కలుపుతూ జోన్‌ను ప్రకటించారు. దీంతో ఆదాయం పోయి జోన్‌ మాత్రమే వచ్చింది. కానీ జోన్‌ నేటికి పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. దీంతో పోరాటాల ఫలితాలు తమకు దక్కలేదని ప్రజాసంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

దేశంలోని రైల్వే జోన్లు, డివిజన్‌లనుకుదిస్తామంటూ ఈనెల21న సభలో చెప్పిన రైల్వే మంత్రి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ పనులపై ఎటువంటి ప్రకటనా చేయలేదు. అయితే గతంలో విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ ప్రకటన చేసి 18 నెలలైంది. డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును విశాఖ రైల్వే అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి 15 నెలలు గడుస్తోంది. అయినా జోన్‌కు సంబంధించిన పనులు ఒక్క అడుగూ ముందుకు పడలేదు. అటు వాల్తేరు అధికారులు డీపీఆర్‌ ఇంకా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోనే ఉందని తెలిపారు. దీంతో విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

రైల్వే ఉద్యోగాల కల్పనలో, రైళ్ల కేటాయింపుల్లో, బడ్జెట్‌ నిధులలో తమకు అన్యాయం జరుగుతుందని ఉత్తరాంధ్ర వాసులు ధ్వజమెత్తుతున్నారు. అదేవిధంగా అనసవర విషయాలపై నేతలు చర్చలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా రైల్వే జోన్‌ అభివృద్ధిపై ఉత్తరాంధ్ర నాయకులు పోరాడాలని విజ్జప్తి చేస్తున్నాయి ప్రజాసంఘాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories