Visakha Dairy Adari Tulasi Rao: విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు కన్నుమూత

Visakha Dairy Chairman Adari Tulasi Rao Passed Away
x

Visakha Dairy Adari Tulasi Rao: విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు కన్నుమూత

Highlights

Visakha Dairy Adari Tulasi Rao: తులసీరావు మృతిపట్ల సీఎం జగన్ సహా ప్రముఖుల దిగ్భ్రాంతి

Visakha Dairy Adari Tulasi Rao: విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తులసీరావు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. ఈ ఉదయం తులసీరావు పార్థివ దేహాన్ని ఆయన స్వగ్రామమైన యలమంచిలికి తరలించారు. 1939 ఫిబ్రవరి 1న అనకాపల్లి జిల్లా యలమంచిలిలో వెంకటరామయ్య, సీతమ్మ దంపతులకు తులసీరావు జన్మించారు. సుమారు 35 ఏళ్లపాటు విశాఖ డెయిరీకి ఆయన చైర్మన్‌గా కొనసాగారు. ఈ సమయంలో విశాఖ డెయిరీని ప్రగతి పథంలో నడిపించారు. రైతుల కోసం విశాఖ డెయిరీ తరఫున కృషి ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. తులసీరావు మృతిపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తులసీరావు భౌతికకాయానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ ఈ ఉదయం 11 గంటలకు యలమంచిలికి రానున్నారు. వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి కూడా జగన్ వెంట రానున్నారు. విశాఖ డెయిరీ వద్ద తులసీరావు పార్థీవదేహాన్ని కడసారి చూసి, నివాళులర్పించేందుకు పాల ఉత్పత్తిదారులు, డెయిరీ ఉద్యోగులు వేలాదిగా తరలివచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories