Nara Lokesh: చంద్రబాబు వేషధారణలో వ్యక్తి.. అతనికి అభిమానిగా మారిపోయానని వీడియో షేర్ చేసిన లోకేష్

Viral Video of Man Imitating Chandrababu Lokesh Praises the Effort
x

Nara Lokesh: చంద్రబాబు వేషధారణలో వ్యక్తి.. అతనికి అభిమానిగా మారిపోయానని వీడియో షేర్ చేసిన లోకేష్

Highlights

Nara Lokesh: కొందరు ప్రముఖులను, లేదంటే తమ అభిమాన నటులను, నాయకులను ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.

Nara Lokesh: కొందరు ప్రముఖులను, లేదంటే తమ అభిమాన నటులను, నాయకులను ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. దీంతో అవి వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఇమిటేట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అది కాస్తా మంత్రి నారా లోకేష్ వరకు చేరడంతో ఆయన దీన్ని షేర్ చేశారు. నేను ఇతడికి అభిమానిగా మారిపోయాను. చంద్రబాబుగారిలా మాట్లాడడానికి, కనిపించడానికి ఎంత కష్టపడ్డాడో చూడండి అంటూ వీడియోను షేర్ చేశారు.

ఇటీవల ఓ మిమిక్రీ ఆర్టిస్టు పెళ్లి వేడుకకు అచ్చం చంద్రబాబు వేషధారణలో హాజరయ్యారు. వేదికపైకి వచ్చి వధూవరులను ఆశీర్వదించడంతో పాటు చంద్రబాబులాగే మాట్లాడి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని ఓ అభిమాని షేర్ చేసి.. వామ్మో సడెన్‌గా చూసి మా పెద్దాయన అనుకున్నా. సేమ్ చంద్రబాబు గారి లానే ఉన్నారు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఆ పోస్టును లోకేష్ షేర్ చేయడం అందర్నీ ఆకర్షిస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories