Rahul Case: విజయవాడ రాహుల్ హత్యకేసులో పురోగతి, ఏ2గా కోగంటి సత్యం

Vijayawada Young Businessman Rahul Assassination Case Full Details Koganti Satyam Arrested in Bengaluru | Live News
x

విజయవాడ రాహుల్ హత్యకేసులో పురోగతి, ఏ2గా కోగంటి సత్యం

Highlights

Rahul Assassination Case: * ఏ1 కోరాడ విజయ్‌తో కలిసి కోగంటి సత్యం హత్యకు ప్లాన్ * ఆర్థిక లావాదేవీల వివాదంతోనే హత్య

Rahul Assassination Case: విజయవాడ వ్యాపారవేత్త రాహుల్ హత్య కేసులో పోలీసులు కోగంటి సత్యంను అరెస్ట్ చేశారు. ఈనెల 23న కోగంటి సత్యం బెంగళూరుకు పరారైనట్టు పోలీసులు గుర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో మెయిల్ ద్వారా బెంగళూరు ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏపీ పోలీసుల సమాచారంతో బెంగళూరు ఎయిర్ పోర్టు అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. పొరిజన్ పాస్‌పోర్ట్ తో పాటు ట్రాన్సిట్ వారెంట్‌ ద్వారా విజయవాడకు తరలించారు.

మరోవైపు.. ఈ కేసులో 9 మంది సాక్షులను విచారించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యంను ఏ2 నిందితుడిగా చేర్చారు. కోగంటి సత్యంపై గతంలో 24 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఏ1 కోరాడ విజయ్‌తో కలిసి సత్యం హత్యకు కుట్ర పన్నాడని పోలీసులు వెల్లడించారు. జిక్సిన్ సిలిండర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రాహుల్‌కు 40శాతం వాటా, కోరాడ విజయ్‌కు 30శాతం, బొబ్బా రాహుల్ చౌదరీకి 20శాతం, బొబ్బా స్వామి కిరణ్‌కు 10శాతం షేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం వచ్చినట్టు పోలీసులు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories