దివ్య హత్య కేసులో వెలుగులోకి వాట్సాప్ ఛాటింగ్

దివ్య హత్య కేసులో వెలుగులోకి వాట్సాప్ ఛాటింగ్
x
Highlights

విజయవాడ ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు నాగేంద్ర స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. 13...

విజయవాడ ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు నాగేంద్ర స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. 13 ఏళ్ల క్రితం దివ్యతో తనకు పరిచయం ఏర్పడిందని ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని తనపై దివ్య ఒత్తిడి తెచ్చిందని నాగేంద్ర చెప్పాడు. పెళ్లి విషయమై మరోసారి ఆలోచించుకోవాలని తాను చెప్పగా దివ్య వినలేదని లాక్‌డౌన్‌లో రహస్యంగా పెళ్లి చేసుకున్నామన్నాడు నాగేంద్ర.

పెళ్లి విషయం తెలుసుకున్న దివ్య తల్లిదండ్రులు ఆమెను తన నుంచి దూరంగా ఉండాలని హెచ్చరించారని దాంతో దివ్య తనను ఏడు నెలలగా దూరం పెట్టిందన్నాడు. ఈ విషయంపై దివ్యతో మాట్లాడేందుకు ఇంటికి వెళ్లగా తన తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించట్లేదని ఇద్దరం ఆత్మహత్య చేసుకుందామని చెప్పిందన్నాడు. దివ్య గొంతు తాను కోయలేదని ఎవరికి వాళ్లం గొంతు కోసుకున్నామని తెలిపాడు నాగేంద్ర. అనంతరం తాను స్పృహ కోల్పోగా తన చేతిని ఎవరు కోశారో అర్థంకాలేదన్నాడు.

మరోవైపు దివ్య, నాగేంద్ర వాట్సాప్ ఛాటింగ్ వెలుగులోకి రావడంతో పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. వాట్సాప్ ఛాటింగ్‌తో పాటు ఇద్దరూ కలిసున్న మరికొన్ని ఫొటోలు బయటపడ్డాయి. దీంతో ఇద్దరు డీప్‌ లవ్‌లో ఉన్నట్టుగా స్పష్టమవడంతో వాట్సాప్ ఛాటింగ్ వ్యవహారంపైనా దృష్టి సారించారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories