Vijayawada: విజయవాడలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

Vijayawada Benz Circle Second Flyover Going to Open Very Soon | AP Latest News
x

Vijayawada: విజయవాడలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

Highlights

Vijayawada: ఈనెల 14 లేదా 15న బెంబ్ సర్కిల్ రెండో ఫ్లైఓవర్ ప్రారంభం...

Vijayawada: విజయవాడ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ -2 నిర్మాణం కూడా పూర్తయింది. దీంతో బెంజ్-2 ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ఉదయం ట్రయల్ రన్ నిర్వహిస్తారు. నగరంలో బెంజి సర్కిల్ చాలా రద్దీగా ఉంటుంది. రెండు హైవేలు ఇక్కడ కలుస్తాయి. దాంతో ట్రాఫిక్ కంట్రోల్ తలకు మించిన భారంగా తయారైంది‌‌. విజయవాడలోనే మొత్తం రాజకీయ, ప్రభుత్వ పెద్దలందరూ ఉండటంతో.. ట్రాఫిక్ ఇబ్బందులు మరింత పెరిగాయి. దీంతో ఫ్లైఓవర్ నిర్మాణమే సొల్యూషన్‌గా భావించారు.

మొదటి ఫ్లైఓవర్ పూర్తయి రాకపోకలు కూడా కొనసాగుతున్నాయి. ఆ తరువాత రెండవ వైపు ఫ్లైఓవర్ నిర్మాణానికి, హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కంట్రాక్టు.. లక్ష్మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కు ఇచ్చింది. అన్ని రకాల అనుమతులు పొందిన వెంటనే పనులు ప్రారంభించి అతితక్కువ కాలంలోనే ఫ్లై ఓవర్ అందుబాటులోకి తెచ్చారు.

బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్-1 స్క్రూ బ్రిడ్జి నుంచి 2.4 కిలోమీటర్ల మేర పొడవు ఉంటుంది‌‌‌‌. ఇక రెండవ ఫ్లై ఓవర్ నిడివి 1.4 కిలోమీటర్లు. మొత్తం 224 భూగర్భ పిల్లర్లు, 56 పిల్లర్లు, 220 గడ్డర్లు, 56 స్పాన్లు, శ్లాబులతో రూపుదిద్దుకుంది. దీంతో విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడినట్లేనని నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories