Vijayawada ammavari shakambari utsavalu: నేటి నుంచి విజయవాడ అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు

Vijayawada ammavari shakambari utsavalu: నేటి నుంచి విజయవాడ అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు
x
Highlights

Vijayawada ammavari shakambari utsavalu: నేటి నుంచి శాకాంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

Vijayawada ammavari shakambari utsavalu: నేటి నుంచి శాకాంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన అవసరమైన ఏర్పాట్లను దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు నేటి నుంచి మూడురోజులపాటు శాకంబరి ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎం.వి.సురే్‌షబాబు తెలిపారు. వివిధ రకాలైన కూరగాయలతో అమ్మవారి అలంకారం జరుగుతుందని, మూడు రోజుల పాటు అమ్మవారు శాకంబరి దేవిగా దర్శనమిస్తారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరిస్తారు. ఆలయప్రాంగణం అంతా పచ్చని కూరగాయల తో అలంకరణ చేస్తారు. వేలాదిగా భక్తులు అమ్మవారిని శాకాంబరి మాత గా దర్శించుకోవడానికి వస్తారు. వర్షాకాలం ప్రారంభమైన తరువాత కూరగాయలతో అమ్మవారిని అర్చించడం ద్వారా రైతులకు ఫలసాయం బాగా వచ్చి..లోకమంతా పచ్చగా ఉంటుందని ప్రజలు నమ్ముతారు.

కరోనా మహమ్మారి ఇబ్బంది పెడుతున్న ప్రస్తుత తరుణంలో భక్తులకు ఆంక్షలతో కూడిన దర్శనం మాత్రమె లభిస్తోంది. అయినప్పటికీ, అధికారులు శాకాంబరి ఉత్సవాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. అన్ని నిబంధనలు పాటిస్తూ భక్తులు అమ్మవారిని శాకాంబరి గా దర్శించుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చూస్తున్నారు. ఇక ఈ సందర్భంగా ప్రజలు కూడా అమ్మవారికి కూరగాయలను కానుకగా సమర్పిస్తుంటారు. సందడి తక్కువగా ఉన్నా ఏటా జరిగే శాకంబరి ఉత్సవాలను కనుల పండువగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు అధికారులు.


Show Full Article
Print Article
Next Story
More Stories