Kakinada Port Case: ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

Vijayasai Reddy Attends ED Inquiry in Kakinada Port Case
x

Kakinada Port Case: ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

Highlights

Kakinada Port Case: కాకినాడ సెజ్ కేసులో (Kakinada SEZ) ఈడీ విచారణకు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) సోమవారం హాజరయ్యారు.

Kakinada Port Case: కాకినాడ సెజ్ కేసులో (Kakinada SEZ) ఈడీ విచారణకు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) సోమవారం హాజరయ్యారు. కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది.మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయనున్నారు. కాకినాడ సీ పోర్టు, సెజ్ కు సంబంధించి అక్రమంగా షేర్ల బదలాయింపులో ఆయనపై ఆరోపణలున్నాయి.సీ పోర్టులో తన వాటాలను బెదిరించి లాక్కున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది.

కాకినాడ సీ పోర్టు, సెజ్ లో 41 శాతం వాటాలు తీసుకున్నారని విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డిలపై కె.వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. అయితే పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున మరోసారి విచారణకు వస్తానని విజయసాయిరెడ్డి ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు.దీంతో ఇవాళ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులతో విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు.

కాకినాడ సీ పోర్టు, సెజ్ విషయంలో తనపై వచ్చిన ఆరోపణలను విజయసాయిరెడ్డి తోసిపుచ్చారు. బెదిరించి షేర్లు బదలాయించుకుంటే ఇంతకాలం ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాజకీయంగా ఇబ్బందులు పెట్టేందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని గతంలోనే ఆయన మీడియా సమావేశంలో చెప్పారు.చట్టపరంగానే కేసులను ఎదుర్కొంటానని ఆయన ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories