ప్రయోజనం లేని కారిడార్‌.. బడ్జెట్‌లో ఏపీకి కేంద్రం మొండి చేయి చూపించింది - విజయసాయిరెడ్డి

ప్రయోజనం లేని కారిడార్‌.. బడ్జెట్‌లో ఏపీకి కేంద్రం మొండి చేయి చూపించింది  - విజయసాయిరెడ్డి
x

విజయ సాయి రెడ్డి ఫైల్ ఫోటో 

Highlights

*స్పెషల్‌ స్టేటస్‌పై ప్రకటన లేదు-విజయసాయిరెడ్డి *కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మొండిచేయి- ఎంపీ విజయసాయి *ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు మాత్రమే కేటాయింపులు చేశారు- విజయసాయి *మెట్రో రైల్‌ కోసం ఆరేళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నాం- విజయసాయి

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో... ఏపీకి ఎలాంటి ఆత్మనిర్భర్‌ లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఏపీకి ఎలాంటి రైల్వే ప్రాజెక్ట్‌లు ప్రకటించలేదని మండిపడ్డారు. స్పెషల్‌ స్టేటస్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందన్న విజయసాయిరెడ్డి.... ప్రయోజనం లేని కారిడార్‌ను ప్రకటించారని విమర్శించారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు మాత్రమే కేటాయింపులు చేశారని... మెట్రో రైల్‌ కోసం ఆరేళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నా పట్టించుకోలేదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అన్యాయం చేసిందని విజయసాయిరెడ్డి అన్నారు. పోలవరం సవరించిన అంచనాలపై లేదని పేర్కొన్నారు. ఎక్కువ కిసాన్ రైళ్లను వేయాలని తాము కోరగా దాన్ని కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. నేషనల్ వైరాలజీ సెంటర్‌ను రాష్ట్రంలో నెలకొల్పాలని కోరినట్లు తెలిపారు. ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రతి జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని తాము కోరినట్లు విజయసాయి రెడ్డి చెప్పారు. ద్రవ్యోల్బణం పెరిగినా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారని, కేంద్ర ప్రభుత్వం ఒకటే ఫిషింగ్ హార్బర్ ఇవ్వడం పెద్దగా చెప్పుకోదగ్గ విషయం కాదన్నారు విజయసాయి రెడ్డి.





Show Full Article
Print Article
Next Story
More Stories