Vidadala Rajini: పురంధేశ్వరి బాబు స్క్రిప్ట్ చదువుతున్నారు..

Vidadala Rajini Slams Purandeswari
x

Vidadala Rajini: పురంధేశ్వరి బాబు స్క్రిప్ట్ చదువుతున్నారు..

Highlights

Vidadala Rajini: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదువుతున్నారని మంత్రి విడదల రజిని అన్నారు.

Vidadala Rajini: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదువుతున్నారని మంత్రి విడదల రజిని అన్నారు. వారి లాగే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పురంధేశ్వరి చంద్రబాబు కోసం పని చేస్తున్నట్టు ఉందన్నారు. విశాఖను విశ్వవిఖ్యాత నగరంగా తీర్చిద్దేందుకు జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. విశాఖను ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్‌గా చేసేందుకు జగన్ పాటుపడుతున్నారని తెలిపారు. రూ. 600 కోట్లు కేజీహెచ్‌ అభివృద్ధికి కేటాయించాం. రూ.153 కోట్లు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ.11 కోట్లతో సీఎస్‌ఆర్ ఫండ్స్ ద్వారా అభివృద్ధి చేశాం. రూ.3820 కోట్లతో మెడికల్ కాలేజీలు అభివృద్ధి చేస్తున్నాం. 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఐదు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. చంద్రబాబు మెడికల్ కళాశాలపై మాట్లాడే అర్హత లేదు. రూ.600 కోట్లతో రహేజా మాలు శంకుస్థాపనకు ముఖ్యమంత్రి ఒకటో తారీఖున వస్తున్నారు. అలాగే రూ.135 కోట్ల రూపాయలతో జీవీఎంసీకి సంబంధించి శంకుస్థాపన చేస్తారు అని మంత్రి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories