Vidadala Rajini: చింతమనేని ప్రభాకర్‌కు మహిళలపై గౌరవం లేదు.. సంస్కారం లేకుండా మాట్లాడటంలో..

Vidadala Rajini Slams Chintamaneni Prabhakar
x

Vidadala Rajini: చింతమనేని ప్రభాకర్‌కు మహిళలపై గౌరవం లేదు.. సంస్కారం లేకుండా మాట్లాడటంలో..

Highlights

Vidadala Rajini: మాజీ MLA చింతమనేని ప్రభాకర్‌పై ఏపీ ఆరోగ్య మంత్రి విడదల రజినీ కౌంటర్ ఎటాక్ చేశారు.

Vidadala Rajini: మాజీ MLA చింతమనేని ప్రభాకర్‌పై ఏపీ ఆరోగ్య మంత్రి విడదల రజినీ కౌంటర్ ఎటాక్ చేశారు. చింత‌మ‌నేని ప్రవ‌ర్తన గురించి అంద‌రికీ తెలుసంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కారం లేకుండా మాట్లాడటంలో త‌న‌కు తానే సాటి అని చింతమనేని అనేక సంద‌ర్భాల్లో నిరూపించుకున్నారన్నారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇంజినీరింగ్ విద్యార్థినిని పరామర్శించేందుకు వెళ్లిన చింతమనేని.. మంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

వైద్యశాఖ మంత్రి మేక‌ప్ వేసుకుని తిరుగుతున్నారా? అంటూ అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి రజినీ ఘాటుగా స్పందించారు. రాజమండ్రిలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ పనులను ఆమె పరిశీలించారు. టీడీపీ హ‌యాంలో వైద్య రంగానికి ఏమీ చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో గ‌తంలో ఎన్నడూ లేని విధంగా వైద్యరంగంలో విప్లవాత్మక‌మైన మార్పులు తీసుకొచ్చామ‌న్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories