Vegetable Prices: ఆకాశాన్నంటుతోన్న కూరగాయల ధరలు

Vegetables Price Hike in Vizianagaram District
x

Vegetable Prices: ఆకాశాన్నంటుతోన్న కూరగాయల ధరలు

Highlights

Vegetable Prices: విజయనగరం జిల్లాలో అల్లాడిపోతోన్న సామాన్యులు

Vegetables Price Hike: విజయనగరం జిల్లాలో కూరగాయల ధరలు అమాంతంగా ఆకాశాన్ని అంటడంతో సామాన్యులు అల్లాడుతున్నారు. ఒకపక్క పెరిగిన ఇంటి అద్దెలు, విద్యుత్ బిల్లులతో సతమతమవుతున్న తరుణంలో నెలరోజులుగా కూరగాయలు ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీంతో అరకొర భోజనం చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు.

గతంలో కేజీ కూరగాయలు కొనే ధరతో.. ఇప్పుడు అరకేజీ కూడా రావడం లేదంటున్నారు విజయనగరం వాసులు. టమాట, పచ్చిమిర్చి, అల్లం ముట్టుకుంటేని షాకిస్తున్నాయని.. మధ్య, పేద తరగతి వాళ్లు ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. బయటి మార్కెట్లలో రేట్లు అధికంగా ఉన్నాయని.. రైతు బజార్లకు వెళ్తే అక్కడా అదే పరిస్థితి ఉందంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెరుగుతున్న కూరగాయల ధరలను నియంత్రించాలని వేడుకోంటున్నారు.

గత నాలుగైదు సంవత్సరాల్లో ఇంతలా కూరగాయల ధరలు ఎన్నడూ చూడలేదంటున్నారు. మొన్నటివరకు వేసవి తీవ్రత ఒక కారణమైతే.. మరోవైపు ఇక్కడ పండిన కూరగాయలను ఇతర రాష్ట్రాలకు తరలించడం ధరలు పెరగడానికి మరో కారణంగా చెబుతున్నారు. అధిక ధరలతో ఇప్పటికే మాంసానికి దూరమయ్యామని.. ఇప్పుడు కూరగాయలు కూడా అదే స్థాయికి చేరితే ఏం తినాలని ప్రశ్నిస్తున్నారు. దినసరి కూలీలు.. కనీసం ఒక్క పూట కూడా భోజనం చేయలేని దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం తక్షణమే కూరగాయల ధలరపై దృష్టి సారించి.. నియంత్రణ చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories