గోదావరి జిల్లాలో యూకే స్ట్రెయిన్ కలకలం

గోదావరి జిల్లాలో యూకే స్ట్రెయిన్ కలకలం
x
Highlights

* రాజమండ్రికి చెందిన మహిళకు కొత్త స్ట్రెయిన్ * ఆమె కుమారుడికి కరోనా నెగిటివ్ * ఇటీవల బ్రిటన్ నుంచి వచ్చిన 114 మంది

తూర్పుగోదావరి జిల్లాలో యూకే స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తోంది. యూకే నుంచి రాజమండ్రికి చెందిన ఒక మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో మరిన్ని టెస్ట్‌లు చేసిన తర్వాత కొత్త స్ట్రెయిన్‌గా నిర్ధారించారు. అయితే. ఆమెకు ప్రైమారీ కాంటాక్ట్‌గా ఉన్న కొడుకుకు మాత్రం నెగిటివ్‌ వచ్చింది. దాంతో కొడుకును ఐసోలేషన్‌లో ఉంచి మహిళను ఆస్పత్రికి తరలించారు. మహిళ నుంచి ఇతరులకు సోకలేదని ఏపీ వైద్యాధికారులు తెలిపారు.

యూకే నుంచి ఏపీకి రీసెంట్‌గా 14వందల 23 మంది వచ్చారు. వారిలో తూర్పుగోదావరి జిల్లాకు 114 మంది వచ్చినట్టు అధికారులు గుర్తించారు. 111 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాకినాడకు చెందిన వ్యక్తికి టెస్ట్‌లు చేయగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన ప్రైమరీ కాంటాక్ట్‌లో మరో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. అయితే వారికి వచ్చింది కొత్తరకం వైరసా లేదా అనేది తెలియడం కోసం వారి శాంపిల్స్‌ను హైదరాబాద్‌ సీసీఎంబీకి పంపించారు మరో ముగ్గురిని గుర్తించాల్సి ఉందని వైద్యులు పేర్కొన్నారు.


జిల్లా వ్యాప్తంగా నమోదు అయిన నాలుగు పాజిటివ్‌ కేసుల్లో.ప్రైమరీ కాంటాక్ట్‌ల లిస్ట్‌ భారీగా ఉంది. వారిని గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. వారిలో ఇప్పటికే వెయ్యి మందికి పరీక్షలు నిర్వహించారు కొంత మంది రిజల్ట్స్ రావాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అనుమానం ఉన్న 24మంది నమూనాలను సీసీఎంబీకి పంపిచారు. వారిలో ఒకరికి యూకే వైరస్ నిర్దారణ అయినట్టు అధికారులు తెలిపారు.



Show Full Article
Print Article
Next Story
More Stories