Srisailam: శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు

Ugadi Mahotsavas in Glory in Srisailam
x

Srisailam: శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు

Highlights

Srisailam: *ఒళ్లు గగుర్పొడిచేలా వీరశైవుల విన్యాసాలు *శరీర భాగాలలో శూలాలతో గుచ్చుకుని భక్తిని చాటిన కన్నడిగులు

Srisailam: శ్రీశైలం మహక్షేత్రంలో ఉగాది మహోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. ఉగాది పర్వదినానికి ముందు రోజు రాత్రి వీరశైవుల అగ్నిగుండ ప్రవేశం ప్రధానమైన ఘట్టం. తమ ఆడపడుచుగా ఆరాదించే భ్రమరాంబికాదేవి సన్నిధిలో కన్నడిగులు సర్వపాపాలు హరించాలన్న సంకల్పంతో శుక్రవారం అమావాస్యనాడు రాత్రి అగ్నిగుండ ప్రవేశం చేశారు. ఎంతో ఆధ్యాత్మిక భరితంగా సాగిన ఈ కార్యక్రమములో ముందుగా వీరశైవులు,ఆలయ అర్చకులు తమవిన్యాసాలు ప్రదర్శించారు. రాత్రి శివదీక్షా శిబిరాలలో శరీర భాగాలలో నోటిలో బుగ్గలలో ఇనుప చువ్వలతో గుచ్చుకుంటూ హరహర మహాదేవా అంటూ ఆ మల్లికార్జునస్వామిని వేడుకున్నారు.

నుదిటిపై కనుబొమ్మలపై చేతులసై గుచ్చుకుంటూ ఒళ్లు గగుర్పొడిచేలా ఇనుప చువ్వలను కన్నడిగుల తమ శరీరభాగాలలో గుచ్చుకుని చేసిన నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి. పూర్వం మల్లికార్జునస్వామిని ప్రసన్నం చేసుకునేందుకు వీరశైవులు తమ శరీరభాగాలను అర్పించేవారని ఇందుకే స్వామివారి గర్భాలయం ఎదురుగా వీరశిరోమండపాన్ని అప్పటి రాజులు నిర్మంచినట్లుగా చరిత్ర చెబుతుంది. ఈ క్రమంలోనే నేటికి ఉగాది పర్వదినానికి ముందు రోజు అమావాస్యనాడు రాత్రి వీరాచార్య విన్యాసం అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాలు సాంప్రదాయ బద్దంగా జరుగుతున్నాయి. అనంతరం వీరశైవ భక్తబృందాలు వీరాచార విన్యాసాలతో అగ్నిగుండంలో నడుచుకుంటూ వారి మొక్కులను తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లవన్న,అర్చకులు,ట్రస్ట్ బోర్డ్ సభ్యులు,సిబ్బంది పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories