Srisailam: శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు.. పెద్దఎత్తున దర్శించుకుంటున్న కన్నడ భక్తులు

Ugadi Mahotsav Celebrations At Srisailam Temple
x

Srisailam: శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు.. పెద్దఎత్తున దర్శించుకుంటున్న కన్నడ భక్తులు

Highlights

Srisailam: కర్ణాటక, మహారాష్ట్ర నుండి భారీగా శ్రీశైలానికి భక్తులు

Srisailam: శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా దేవస్థానం ఈవో పెద్దిరాజు దర్శన ఏర్పాట్లు చేశారు. కన్నడ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని..వేకువ జామునుండే భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతినిచ్చారు. కన్నడ భక్తులు భ్రమరాంబికాదేవిని తమ ఆడపడుచుగా భావిస్తారు.

దీంతో భ్రమరాంబికాదేవిని తనివితీరా దర్శించుకునేందుకు క్యూలైన్ని కన్నడ భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు సిద్ధం చేసి మొత్తం 15 కౌంటర్ల ద్వారా లడ్డు ప్రసాదాలను విక్రయిస్తున్నామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories