చిక్కుముడి వీడిన దుర్గమ్మ వెండి సింహాల చోరీ కేసు

చిక్కుముడి వీడిన దుర్గమ్మ వెండి సింహాల చోరీ కేసు
x
Highlights

విజయవాడ కనక దుర్గమ్మ ఆలయంలో వెండి సింహాల చోరీ కేసును పోలీసులు ఛేధించారు. పాత నేరస్ధులు తరచుగా ఆలయాలలో‌ నేరాలకు పాల్పడే వారి జాబితా నిందితుడిని...

విజయవాడ కనక దుర్గమ్మ ఆలయంలో వెండి సింహాల చోరీ కేసును పోలీసులు ఛేధించారు. పాత నేరస్ధులు తరచుగా ఆలయాలలో‌ నేరాలకు పాల్పడే వారి జాబితా నిందితుడిని పట్టించిందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో సీట్‌, సిటీ పోలీసులు కీలక పాత్ర పోషించారని సీపీ బి.శ్రీనివాసులు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి150 మందిని విచారించామని, ఈ కేసులో ప్రధాన నిందితుడు భీమవరం మండలం గొల్లవానిరేవు గ్రామానికి చెందిన సాయిబాబాగా నిర్థారించామని సీపీ పేర్కొన్నారు. గతంలో భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు పట్టణాలలోని ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన నిందితుడు సాయిబాబా.. 2012లో చివరిసారిగా పోలీసులకు పట్టుబడ్డాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ ఆలయాల్లో చోరీలు మొదలుపెట్టాడని సీపీ వెల్లడించారు. సాయితో పాటు బంగారం వ్యాపారి ముత్తా కమలేష్‌ను కూడా అరెస్టు చేశామని, చోరికి గురైన మొత్తం వెండితో పాటు మిగతా ఆలయాల్లో దొంగతనాలకు సంబంధించిన 6.4 కేజీల వెండిని రికవరి చేశామని సీపీ తెలిపారు.



Show Full Article
Print Article
Next Story
More Stories