Nellore: నెల్లూరులో టెన్నల్ అక్వేరియం ఏర్పాటు

Tunnel Fish Aquarium in Nellore
x

Nellore: నెల్లూరులో టెన్నల్ అక్వేరియం ఏర్పాటు

Highlights

Nellore: అడుగు పెట్టామంటే తెలియని అనుభూతి

Nellore: అదో అద్భుత ప్రపంచం. అక్కడ అడుగు పెట్టామంటే ఊహల్లో తేలిపోయే అనుభూతి. సముద్ర గర్భంలో సంచరిస్తున్నామన్న భావన. మైమరపించే సముద్ర గర్భ దృశ్యాలు. చుట్టూ వందల సంఖ్యలో అందమైన చేపలు.... వాటి కేరింతలు.... అదో ప్రపంచాన్ని తలపిస్తోంది. ఇంతకీ ఏంటిది ? ఎక్కడుంది తెలియాంటే వాచ్ దిస్ స్టోరీ.

నెల్లూరు నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టెన్నల్ అక్వేరియం ఎక్స్పో అందరిని మైమరిపిస్తోంది. వివిధ పర్యాటక దేశాలు.. మహా నగరాలకే పరిమితమైన ఈ వాటర్ టెన్నల్ అక్వేరియం ఎక్స్పో నెల్లూరు వాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అక్వేరియంలో మహా అయితే రెండు మూడు రకాల చేపలుంటాయి, ఇంకా పెద్ద అక్వేరియం అయితే ఓ పది రకాల చేపల్ని పెంచుతారు. కానీ ఇక్కడ 150 రకాల చేపల్ని ఒకేసారి ప్రదర్శనకు పెట్టారు. అది కూడా టన్నెల్ లాంటి నిర్మాణంలో చేపలు మనపై నుంచి కదులుతున్నట్టు, మన పక్కనుంచి వెళ్తున్న అనుభూతిని కలిగిస్తోంది.

నెల్లూరులోని శ్రీ వేణుగోపాల స్వామి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఈ అండర్ వాటర్ అక్వేరియం ఎక్స్ పో.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తొలి ప్రదర్శనగా రికార్డుకెక్కింది. ఇప్పటి వరకూ సింగపూర్, మలేసియా, దుబాయ్‌లో ఇలాంటి అక్వేరియంలు ఉండేవని, ఇప్పుడిది తొలిసారిగా నెల్లూరులో ఏర్పాటు చేశామని అంటున్నారు నిర్వాహకులు.

నెల్లూరులోని కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ అక్వేరియంతో పాటు భారీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ సాయంత్రం 3 గంటల నుంచి సందర్శకులను అనుమతిస్తున్నారు. ఇది చూసిన వారి అనుభూతి వర్ణనాతీతం అనే చెప్పాలి. వయసుతో సంబందం లేకుండా ప్రతీ ఒక్కరు ఎంజాయి చేస్తున్నారు. టెన్నల్ అక్వేరియం చూడటం వల్ల పదేళ్ల వయస్సు పెరిగినట్టు మానసికానందం పొందుతున్నామంటున్నారు సందర్శకులు.

ఈ అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియాన్ని చూసేందుకు పిల్లలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఎక్కడా చూడని చేపలు, భవిష్యత్తులో చూడలేని చేపల్ని కూడా పిల్లలు ఇక్కడ ఒకేసారి చూడవచ్చని తల్లిదండ్రులు చెబుతున్నారు.

ఈ అండర్ టెన్నల్ అక్వేరియంలో నడచినంత సేపూ తమపై నుంచి చేపలు వెళ్తున్న అనుభూతి కలుగుతుందని సందర్శకులు అంటున్నారు. ఇంతటి అక్వేరియం తమ నెల్లూరులో ఏర్పాటు చేయడం సంతోషం ఉందంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories