Tirumala: ఇకపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ఈ రోజుల్లో మాత్రమే..!

TTD Made Key Decision on VIP Break Darshan
x

Tirumala: ఇకపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ఈ రోజుల్లో మాత్రమే..!

Highlights

Tirumala: సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక ప్రకటన చేసింది.

Tirumala: సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక ప్రకటన చేసింది. వీఐపీ బ్రేక్‌ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం​ తీసుకుంది. శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సర్వదర్శనం భక్తులకు కేటాయించేందుకు శుక్ర, శని, ఆదివారాల్లో సిఫార్సు లేఖలపై కేటాయించే వీఐపీ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. వీఐపీల కోసం కేటాయించిన సమయాన్ని కూడా సామాన్య భక్తులకు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

అలాగే.. శుక్ర, శని, ఆదివారాలలో సర్వదర్శనం భక్తుల సౌకర్యార్దం అదనంగా దర్శన టోకన్లు జారి చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే రోజుకు సర్వదర్శనం భక్తులకు 30 వేల టోకేన్లు టీటీడీ జారీ చేస్తోన్న విషయం తెలిసింది. టీటీడీ తాజా నిర్ణయంతో సర్వదర్శన భక్తులకు రోజుకు అదనంగా మరో రెండు గంటల దర్శన సమయం పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories