Tirumala: తిరుమలలో భక్తులకు అందుబాటులో మరోసేవ?

Tirumala : Tirumala Information: Crowd of devotees is common in Tirumala
x

Tirumala : తిరుమల సమాచారం: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Highlights

Tirumala: కలియుగ పుణ్యక్షేత్రం తిరుమలలో విశేష పూజ ఆర్జిత సేవ పునఃప్రారంబించాలని డిమాండ్ వినిపిస్తుంది.

Tirumala: కలియుగ పుణ్యక్షేత్రం తిరుమలలో విశేష పూజ ఆర్జిత సేవ పునఃప్రారంబించాలని డిమాండ్ వినిపిస్తుంది. గతంలో ప్రతి సోమవారం నిర్వహించే ఈ‌సేవని ఏడాదిలో ఒక్కసారి నిర్వహించాలని ఆలయ అర్చకులు కోరుతున్నారు. శ్రీవారికి నిత్యం సుప్రభాతంతో మేలుకొలుపు పలికి తోమాలతో పుష్కలంకరణ చేసి అర్చనతో సహస్రనామార్చన నిర్వహిస్తారు. అ తర్వాత సాయంత్రం తోమాల అర్చనతో పాటు రాత్రి ఏకాంత సేవతో స్వామివారికి పవళింపు సేవ నిర్వహిస్తారు.

ఇక వారపు సేవలలో సోమవారం విశేష పూజ మంగళవారం అష్టదళ పాదపద్మారాధన బుధవారం సహస్ర కలశాభిషేకం గురువారం తిరుప్పావడ శుక్రవారం అభిషేకాలు సేవలు నిర్వహించేవారు. విశేష పూజ, సహస్ర కలశాభిషేకం, వసంతోత్సవం సేవలలో ఉత్సవ మూర్తులకు స్వపన తిరుమంజనం నిర్వహించేవారు.

అయితే ఈ సేవలతో ఉత్సవాల విగ్రహాలు అరుగుదల జరుగుతుందని ఆలయ పండితులు ఆగమ సలహా మండల సూచనల మేరకు.. టీటీడీ ఈ సేవలు గతంలో రద్దు చేసింది. కరోనా మహమ్మారి తర్వాత పునఃప్రారంభించాలని టీటీడీ భావించింది. మంగళవారం నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన గురువారం నిర్వహించే తిరుప్పావడ సేవలలో అభిషేక కార్యక్రమాలు లేనందున ఉత్సవమూర్తుల అరుగుదల ఉండదని గుర్తించి ఆ సేవలను పునఃప్రారంబించారు.

ఇక బుధవారం నిర్వహించాల్సిన సహస్ర కలశాభిషేకం సేవను ఏడాదిలో ఒకసారి నిర్వహిస్తున్నారు. నిత్యం నిర్వహించే వసంతోత్సవాలను సైతం ప్రతి ఏడాది మూడు రోజుల నిర్వహిస్తున్నారు. ఇదే విధానంలో విశేష పూజలు కూడా ఏడాది ఒకసారి నిర్వహించాలని ప్రతిపాదన చేశారు. ఆగమ సలహా కమిటీ ఈ ప్రతిపాదనపై టీటీడీ ఈవో శ్యామలరావు సానుకూలంగా స్పందించారు. దీంతో 2022లో రద్దైన విశేష పూజ త్వరలో పునః ప్రారంభం కానున్నదని తిరుమల కొండపై చర్చ నడుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories