TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్...ఆ ఒక్కరోజు మాత్రమే బంపరాఫర్..పూర్తి వివరాలివే

Srivari Arjita Seva tickets released today
x

TTD Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Highlights

TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలతోపాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఖాళీ టిన్ ల సేకరణకు సంబంధించిన సీల్డ్ టెండర్లను ఆహ్వానించింది. ఈనెల 6వ తేదీన మధ్యాహ్నం 3గంటలలోపు సీల్డ్ టెండర్లు అందజేయాలని టీటీడీ భక్తులకు సూచించింది. ఆసక్తి ఉన్నవారు టెండర్లు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది.

TTD News: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాల్లో నెయ్యి, నూనె, జీడిపప్పు ప్యాకింగ్ కు వినియోగించే ఖాళీటిన్ ల సీల్డ్ టెండర్లను ఆహ్వానిస్తోంది. టెంటర్ పొందినవారు టీటీడీ వినియోగించిన ఖాళీ టిన్స్ సేకరించవచ్చు. తిరుపతిలోని హరేక్రుష్ణ రోడ్డులో ఉన్న మార్కెటింగ్ కార్యాలయంలో సీల్డ్ టెండర్లు సెప్టెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 3గంటలలోపు అందజేయాలి. ఇతర వివరాలకు మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించాలని టీటీడీ తెలిపింది.

తిరుమల శ్రీవారి ఆలయంలో నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణలో ఈ ఉత్సవాలు ప్రారంభం అవుతాయని టీటీడీ తెలిపింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజూ ఉదయం 8గంటల నుంచి 10 గంటల వరకు సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల తొలిరోజు అక్టోబర్ 4 సాయంత్రం 5.45 నుంచి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రం 9గంలకు పెద్ద శేష వాహన సేవ ఉంటుంది.

అక్టోబర్ 5న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7గంటలకు హంస వాహనం, అక్టోబర్ 6న ఉదయం 8గంటలకు సింహవాహనం, మధ్యాహ్నం 1గంటకు స్నపనం, రాత్రం 7గంటలకు ముత్యపు పందిరి వాహణం, అక్టోబర్ 7న ఉదయం 8గంటలకు కల్పవ్రుక్ష వాహనం, మధ్యాహ్నం 1గంటకు స్నపనం, రాత్రం 7గంటలకు సర్వ భూపాల వాహనం, అక్టోబర్ 8న ఉదయం 8గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6.30 నుంచి రాత్రం 11.30 గంటల వరకు గరుడ వాహనంపై శ్రీవారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

ఇక అక్టోబర్ 9న ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం, అక్టోబర్ 10న ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం, అక్టోబర్ 11న ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం.. అక్టోబర్ 12న ఉదయం 6 నుంచి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుంచి 10:30 వరకు ద్వాజావరోహణం నిర్వహిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories