తిరుమలలో కాసుల పంట ... రికార్డు స్ధాయిలో పెరుగుతున్న శ్రీవారి ఆదాయం

TTD Hundi Revenue is Increasing At a Record Level
x

తిరుమలలో కాసుల పంట ... రికార్డు స్ధాయిలో పెరుగుతున్న శ్రీవారి ఆదాయం

Highlights

Tirumala: సాధారణ రోజుల్లో 70వేలు, సెలవు దినాల్లో లక్షమంది దాకా భక్తుల దర్శనం

Tirumala: తిరుమలేషుడిని క్షణం పాటు దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగి కోరిన కోరికలు తీరుతాయని శ్రీ వారి భక్తుల విశ్వాసం. అందుకే ఆ దేవదేవుని దర్శనార్ధం వచ్చే భక్త జనం రోజు రోజుకు పెరగడమే కాకుండా స్వామి వారికి భక్తులు సమర్పించే కానుకలు సైతం రికార్డ్ స్థాయిలో పెరిగాయి. గత 4 నెలల్లో 509కోట్ల 76లక్షల రూపాయలు హుండీ కానుకల ద్వారా భక్తులు శ్రీవారికి సమర్పించారు.

తిరుమల క్షేత్రం నిత్యం దేశ విదేశాల నుండి వస్తున్న భక్తజనంతో కిటకిటలాడుతోంది. టీటీడీ అధికారిక లెక్కల ప్రకారం సాధారణ రోజులలో 60 నుండి 70వేల మంది శెలవు పర్వదినాలలో 80నుండి లక్షమంది దాకా శ్రీవారిని దర్శించుకుంటారు. ఇలా ఏడాదికి రెండు కోట్ల మంది శ్రీవారిని దర్శిస్తారు. అయితే ఈ వేసవి శెలవుల సందర్భంగా ఎన్నడూ లేని విధంగా భక్తులు శ్రీవారిని, రికార్డ్ స్థాయిలో దర్శించుకున్నారు. జూన్ నెలలో 23లక్షల 21వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

హుండీ ద్వారా 123కోట్ల 76లక్షల రూపాయలను కానుకల రూపంలో సమర్పించారు. జూన్ నెలలో భక్తులతో సంఖ్యతో పాటు హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. కరోనా ప్రభావం తగ్గడంతో పాటు వేసవి శెలవులు రావడంతో తిరుమల కొండ నిత్యం భక్తుల రద్దీతో కళకళలాడుతోంది. అయితే రద్దీ అధికంగా ఉన్న రోజుల్లో వీ.ఐ.పీలను మినహాయిస్తూ సిఫార్స్ లేఖలు, బ్రేక్ దర్శనాలను రద్దు చేసి, సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు.

కోవిడ్ పరిస్థితుల అనంతరం ఏప్రిల్ నుండి సర్వదర్శనం భక్తులను అనుమతిస్తుండటంతో తిరుమల శ్రీవారికి హుండీ కానుకలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో 128కోట్లు ఏప్రిల్ నెలలో 127కోట్ల 5లక్షలు మే నెలలో 130కోట్ల5లక్షలు జూన్‌లో 123కోట్ల 76లక్షల రూపాయల హుండీ కానుకలు లభించాయి. జూలై 4వ తేదీన ఒక్కరోజే 6కోట్ల 18లక్షల రూపాయలు వచ్చాయి. టీటీడీ చరిత్రలో 6కోట్లకు పైగా ఆదాయం రావడం ఇది రెండోసారి. 2018 సంవత్సరం జూలై 26వ తేదీన 6కోట్ల 82లక్షల రూపాయలు హుండీ ద్వారా లభించింది. తిరుమల చరిత్రలోనే హుండీ కానుకల ద్వారా అత్యధికంగా ఆదాయం లభించి రికార్డుగా నిలిచింది.

జూలై 4వ తేదీన ఓ అజ్ఞాత భక్తుడు 1కోటి 64లక్షల రూపాయలను స్వామివారికి సమర్పించాడు. కరోనాకు ముందు 2018-19 సంవత్సరంలో 12వందల6కోట్ల రూపాయల ఆదాయం రాగా కరోనాతో 2019-20..2020-21 సంవత్సరాల్లో శ్రీవారి హుండీ ఆదాయం భారీగా తగ్గింది. అయితే ఈ సంవత్సరం గత 4నెలల్లో 509కోట్ల 76లక్షల హుండీ కానుకలు భక్తులు స్వామివారికి సమర్పించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories