TTD Board Meeting: నేటితో ముగియనున్న టీటీడీ పాలకమండలి గడువు

TTD Governing Body Meeting Ends Today 21 06 2021
x

టీటీడీ పాలకమండలి (ఫైల్ ఇమేజ్)

Highlights

TTD Board Meeting: మరో రెండు నెలలు ఉన్న సభ్యుల పదవీ కాలం * మండలి కొనసాగాలంటే ఛైర్మన్ తప్పనిసరి

TTD Board Meeting: టీటీడీ పాలకమండలి గడువు నేటితో ముగుసిపోనుంది. పాలక మండలి అధ్యక్షుడి నియామకం‌ జరిగి నేటికి రెండేళ్లు పూర్తయ్యింది. కానీ పాలక మండలి సభ్యల పదవీకాలం మరో రెండు మాసాల గడువు ఉంది. కానీ ఛైర్మన్ లేని మండలి కొనసాగడానికి అవకాశం లేదు. దీంతో వైవీ సుబ్బారెడ్డికి ఎక్స్‌టెన్షన్ వచ్చే ఛాన్స్ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో టీటీడీ పాలక మండలి సభ్యులు 18 మంది ఉండేవారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ సంఖ్యను 36కు చేర్చింది. సాధారణంగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారికే సభ్యత్వ అవకాశముండేది. కానీ ఈసారి ఢిల్లీ వరకు విస్తరించారు. కానీ కరోనా కారణంగా పదవి అనుభవించే భాగ్యం లభించలేదు. 2019 జూన్ 21న టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నియామకమయ్యారు. అదే ఏడాది సెప్టెంబర్ 22న పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

కానీ వరుస లాక్‌డౌన్లతో పాలక మండలి పని పరిమితమైపోయింది. అప్పుడప్పుడూ సమావేశాలు అది కూడా ఆన్‌లైన్ వర్చువల్ మీటింగులతో గడిచిపోయింది. దీంతో మరో ఏడాది తమకు అవకాశం ఇవ్వాలని పాలకమండలి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తోంది. అయితే అలాంటి పరిస్థితి కానరావడం లేదు‌. చైర్మన్‌కు మాత్రం మరో ఏడాది కొనసాగే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories