Tirumala: తిరుమల ప్రక్షాళనకు టీటీడీ ఈవో శ్రీకారం.. సీఎం విజన్ ప్రకారమే యాక్షన్ ప్లాన్..

TTD EO Mulls to Revamp Tirumala
x

Tirumala: తిరుమల ప్రక్షాళనకు టీటీడీ ఈవో శ్రీకారం.. సీఎం విజన్ ప్రకారమే యాక్షన్ ప్లాన్..

Highlights

Tirumala: తిరుమలలో సామాన్యులకు శ్రీవారి దర్శనం ఇక సులభతరం కానుందని టీటీడీ ఈవో శ్యామల రావు భక్తుల హామీ ఇచ్చారు.

Tirumala: తిరుమలలో సామాన్యులకు శ్రీవారి దర్శనం ఇక సులభతరం కానుందని టీటీడీ ఈవో శ్యామల రావు భక్తుల హామీ ఇచ్చారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే అధికారును పరుగులు పెట్టించారు. ఈవో నిబద్ధత కూడిన వ్యవహార శైలితో పలువురు అధికారుల్లో గుబులు మొదలైంది. స్థానిక‌ గోకులం గెస్ట్ హౌస్ లోని మీటింగ్ హాలులో టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, ఆకౌంట్స్ ,సర్వీసెస్ , ఏస్టేట్ విభాగాలపై లోతుగా సమీక్షించారు. ఇటీవల‌ 6 నెలల కాలంలో గత పాలకమండలి విడుదల చేసిన దాదాపు రూ.1500 కోట్లకు పైగా నిధులు వినియోగం పై ఈవో లోతుగా అధ్యయనం చేస్తున్నారు.

గత పాలకమండలి ఇష్టారీతిన టీటీడీ నిధులను దారి మళ్లించారనే ఆరోపణలతో సహా ఇటీవల సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారం అనంతరం మొదటిసారి మీడియాతో మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో తిరుమలను భ్రష్ఠు పట్టించారని, పవిత్రతను దెబ్బతీసారన్న కోణంలో ప్రక్షాళన మొదలైంది. సీఎం చంద్రబాబు విజన్ ప్రకారం యాక్షన్ ప్లాన్ ను ప్రారంభించారు. సిఫార్సు లేఖలపై దర్శనాలు, సేవలు కేటాయించే అదనపు ఈవో క్యాంపు కార్యాలయ సిబ్బందిని కూడా ఈవో ప్రశ్నించారు.

సామాన్య భక్తుల దర్శన క్యూలైన్ లు వద్ద తనిఖీలు నిర్వహించారు. పారిశుద్ధ్యం నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఇద్దరు అధికారులకు ఈవో మెమోలు జారీ చేశారు. అన్నప్రసాద భవనంలోనూ తనిఖీలు చేపట్టారు..వడ్డిస్తున్న ఆహారం రుచికరంగా ఉందా, ఎదైనా లోపాలు ఉన్నాయా అని భక్తులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అన్నప్రసాదం తయారీ విధానాన్ని, వినియోగించే ముడిసరుకులు నాణ్యత కూడా ఈవో పరిశీలించారు. భక్తులకు అందించే సదుపాయాలు, సౌకర్యాల విషయంలో రాజీపడితే చర్యలు తప్పవని అధికారులను ఈవో హెచ్చరించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories