TTD Chairman: తిరుపతి తొక్కిసలాట.. భక్తులకు క్షమాపణలు చెప్పిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

TTD Chairman: తిరుపతి తొక్కిసలాట.. భక్తులకు క్షమాపణలు చెప్పిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
x
Highlights

TTD Chairman: తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు క్షమాపణలు చెప్పారు. తమ తప్పు లేకపోయినా సరే క్షమాపణలు...

TTD Chairman: తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు క్షమాపణలు చెప్పారు. తమ తప్పు లేకపోయినా సరే క్షమాపణలు చెబుతున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే టీటీడీ బోర్డు సమావేశం జరుగుతున్న సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..మరణించినవారి కుటుంబాలకు టీటీడీ బోర్డు తరపున చైర్మన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని కోరారు. ఈ నేపథ్యంలోనే తాను క్షమాపణలు చెబుతున్నట్లు బీఆర్ నాయుడు తెలిపారు.

పాలకమండలి సమవేశం తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ నాయుడు మాట్లాడారు. క్షమాపణలు చెప్పడంలో తప్పులేదు. కానీ క్షమాపణలు చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్లు తిరిగి రారు కదా. ఎవరో ఏదో మాట్లాడారని దానిపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. అయితే టీటీడీ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా ఉండటంతో దానిపై మరోసారి మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలు తాము పాటిస్తున్నామని తమ తప్పులేకపోయినా సరే..క్షమాపణలు చెబుతున్నామని బీఆర్ నాయుడు తెలిపారు. దీంతోపాటు బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు తాను చేసిన వ్యాఖ్యలను ఆపాదించడం భావ్యం కాదన్నారు టీటీడీ చైర్మన్.

నేను చేసిన వ్యాఖ్యలు డిప్యూటీ సీఎంను ఉద్దేశించినవి కాదు. మొన్న ఘటన జరిగిన వెంటనే మీడియా ముందు భక్తులకు,మరణించివారి కుటుంబాలకు క్షమాపణ చెప్పాను. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల కమిటీ కంటే ముందుగా టీటీడీ పాలకమండలి క్షమాపణ చెప్పిందని గుర్తు చేశారు. తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నానని..క్షమాపణల గురించి అవసరమైన అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories