TTD: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ షాక్..ఆ టికెట్లన్నీ రద్దు

TTD Eo J Syamala Rao Cancelled Reverse Tendering System in Tirumala
x

TTD: టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం.. జగన్ సర్కార్ తీసుకొచ్చిన మరో విధానం రద్దు

Highlights

TTD: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసిన దివ్యక్షేత్రం తిరుమల. ఆ దేవదేవుడు స్వయంగా ప్రత్యక్షమై వెలసిన క్షేత్రం కావడంతో నిత్యం లక్షలాది...

TTD: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసిన దివ్యక్షేత్రం తిరుమల. ఆ దేవదేవుడు స్వయంగా ప్రత్యక్షమై వెలసిన క్షేత్రం కావడంతో నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తరలివస్తుంటారు. వేలాది మంది భక్తులు ఆర్జిత సేవలు, నిత్య సేవలు, విఐపీ బ్రేక్, వర్చువల్ సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు అంటూ రకరకాల టికెట్లను టీటీడీ వారికోసం జారీ చేస్తుంటుంది.

శ్రీవారి దర్శన టికెట్లకు ఉన్న డిమాండ్ మామూలుది కాదు. ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కూడా బ్లాక్ మార్కెట్లో రూ 2000 అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటిన్నింటినీ అరికట్టేందుకు టీటీడీ గతంలో సుదూరు ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం టూరిజం కోటాలో 4వేల నుంచి సుమారు 5వేల వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనాలను జారీ చేస్తోంది.

ఏపీఎస్ఆర్టీసీ, టీజీఆర్టీసీ, కెఎస్ఆర్టీసీ టీఎన్ఆర్టీసీ, ఏపీ టూరిజం, ఐఆర్సిటీసీ ఇలా ఎన్నో సర్వీసులకు టూరిజం కోటాలో టికెట్లను కేటాయిస్తోంది టీటీడీ. ఒక్కో టికెట్ ధర రూ. 500 నుంచి రూ. 3000 వరకు టికెట్ల ప్యాకేజీ అందుబాటులో ఉంటున్నాయి.

ఈ టికెట్లను బ్లాక్ మార్కెట్లో రూ. 5వేలకు విక్రయించిన సందర్బాలు కూడా ఉన్నాయి. అయితే వీటిపై అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. పూర్తిస్థాయిలో దళారుల చేతిలో పడిపోయాయని టీటీడీకి అనేక విమర్శలు కూడా వచ్చాయి. దీనిపై టీటీడీ విజిలెన్స్ విచారణ చేపట్టి నివేదికలు సమర్పించింది. దీనిలో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు టీటీడీ అధికారులు.

ఇక దళారులు టూరిజం టికెట్లను కూడా అక్రమ మార్గంలో విక్రయిస్తున్న నేపథ్యంలో టూరిజం టికెట్లను రద్దు చేయాలని టీటీడీ చైర్మన్ బి. ఆర్ నాయుడు స్పష్టం చేశారు. తిరుమల విహారయాత్ర చేసుకునే ప్రదేశం కాదని..పవిత్రమైన పుణ్యక్షేత్రంలో టూరిజం టికెట్లు కేటాయించాల్సిన అవసరం లేదని తెలిపారు.

ప్రస్తుతం టూరిజం కోటాలో ఇస్తున్న టికెట్లన్నీ రద్దు చేస్తామన్నారు. ఈ టికెట్ల రద్దుతో మరో గంటకు పైగా సమయం సర్వదర్శనానికి అధికంగా వినియోగించాల్సి ఉంటుంది. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చెబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories