TTD: భక్తుల రద్దీ దృష్ట్యా.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. రేపటి నుంచి ఆదివారం వరకు...

TTD Cancelled VIP Break Darshan From 13 04 2022 to 17 04 2022 | Live News
x

TTD: భక్తుల రద్దీ దృష్ట్యా.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. రేపటి నుంచి ఆదివారం వరకు...

Highlights

TTD: తిరుపతి శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద తోపులాట...

TTD: తిరుమల శ్రీవారి సర్వదర్శనం టిక్కెట్లకు భారీ డిమాండ్ నెలకొంది. దీంతో టికెట్ల కోసం భక్తుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో కొందరు స్పృహ తప్పిపడిపోయారు. సర్వదర్శనం టికెట్ల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్ కూడా స్వల్పంగా దెబ్బతింది. సర్వదర్శనం టికెట్ల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. తిరుపతిలోని మూడు చోట్ల TTD భక్తులకు సర్వదర్శనం టికెట్లను జారీ చేస్తుంది. టీటీడీ రెండో సత్రం, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం వద్ద టోకెన్లు జారీ చేస్తున్నారు.

ఈ మూడు కౌంటర్ల వద్ద కూడా భారీ సంఖ్యలో భక్తులు టోకెన్ల కోసం ఎదురు చూస్తున్నారు. కిలోమీటర్ల దూరం భక్తులు సర్వదర్శనం టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. గంటల తరబడి టికెట్ల కోసం చూసి విసిగిపోయిన భక్తులు టికెట్ కౌంటర్ వద్దకు భక్తులు తోసుకురావడంతో తోపులాట చోటు చేసుకొంది. సరైన ఏర్పాట్లు చేయని కారణంగా ఈ పరిస్థితి నెలకొందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా సర్వదర్శనం టికెట్ల జారీని నిలిపివేశారు.

దీంతో ఇవాళ్టి నుండి సర్వదర్శనం టికెట్లను జారీ చేయడంతో భక్తులు పెద్ద సంఖ్యలో టికెట్ల కోసం పోటీ పడ్డారు. అయితే భక్తుల మధ్య తోపులాటను కంట్రోల్ చేయడంలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది చేతులెత్తేశారు. దీంతో తిరుపతి పోలీసులు రంగంలోకి దిగారు. క్యూ లైన్లలో భక్తుల మధ్య తోపులాటతో పలువురు భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. మరోవైపు భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం భక్తుల రద్దీ పెరగడంతో పాలక మండలి నిర్ణయం తీసుకుంది. విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. రేపటి నుంచి ఆదివారం వరకు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది టీటీడీ పాలకమండలి.

Show Full Article
Print Article
Next Story
More Stories