TTD Latest News: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్

TTD Alerts Tirumala Visiting Devotees with October Month Tickets and New Covid Guidelines | Telugu Online News
x

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్

Highlights

TTD Latest News: *నేడు రూ.300 టోకెన్లు విడుదల *రేపు సర్వ దర్శనం టోకెన్లు రిలీజ్

TTD Latest News: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. అక్టోబరు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఎల్లుండి ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్లను 'గోవింద' యాప్‌లో కాకుండా టీటీడీ వెబ్‌సైట్‌లోనే బుక్‌ చేసుకోవాలని టీటీడీ తెలిపింది. రూ.300 టోకెన్లు, సర్వ దర్శనం టోకెన్లు శుక్ర, శనివారాల్లో విడుదల కానుండటంతో భక్తులు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ రూ.300 టోకెన్లు దొరక్కపోయినా సర్వ దర్శనం టోకెన్లు తీసుకోవాలని భావిస్తున్నారు.

మరోవైపు సర్వదర్శన టోకెన్లను శనివారం టీటీడీ విడుదల చేయనుంది. ఈ నెల 25న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తారు. సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 31 వరకు రోజుకు ఎనిమిది వేల చొప్పున ఎస్డీ టోకెన్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నారు. 26 నుంచి తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో జారీ చేసే ఎస్డీ టోకెన్లను నిలిపివేయనున్నారు. తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం గుంపులుగా నిలబడటం వల్ల కరోనా వేగంగా సంక్రమించే ప్రమాదం ఉందని.. ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు తిరుమల వెళ్లే భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకు వచ్చింది. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్, మూడు రోజుల ముందు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కొవిడ్ నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొవిడ్ నియంత్రణ కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories