Allowing Ambulances: అంబులెన్సులను అనుమతిస్తోన్న తెలంగాణ సర్కార్

TS Govt is Allowing Ambulances at Borders
x

Allowing Ambulances at Borders:(File Image)

Highlights

Allowing Ambulances: బోర్డర్‌లో అంబులెన్సుల నిలిపివేతపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.

Allowing Ambulances: ఎట్టకేలకు తెలంగాణ సర్కార్ ఏపీ నుంచి వస్తోన్న అంబులెన్సులను అనుమతిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే ఇచ్చిన హైకోర్టు..బోర్డర్‌లో అంబులెన్సుల నిలిపివేతపై ఆగ్రహం వ్యక్తంచేసింది. సరిహద్దుల్లో అంబులెన్సులను ఆపొద్దన్న తమ ఆదేశాలను పాటించకపోవండంపైనా సీరియస్‌ అయ్యింది. తాము వద్దన్న పనిని ప్రభుత్వం చేసి చూపిస్తుందన్న హైకోర్టు.... సర్కారు చర్యలు కోర్టు ధిక్కరణ కిందకి వస్తాయంటూ హెచ్చరించింది.

దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం అంబులెన్సులను అనుమతించాలని నిర్ణయించింది. ఈ మేరకు సూర్యాపేట జిల్లా రామాపురం చెక్‌పోస్ట్‌ వద్ద ఇప్పటి వరకు అమలు చేసిన ఆంక్షల్ని ఎత్తివేశారు. దీంతో ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో రోగుల బంధువులు కాస్త కుదుటపడ్డారు. ఎలాంటి పాసులు, అనుమతి పత్రాలు లేకపోయినప్పటికీ.. పోలీసులు అంబులెన్సులను అనుమతిస్తుండడం గమనార్హం.

అంతకుముందు అంబులెన్సులను నిలిపివేయాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలను సవాల్‌ చేస్తూ విశ్రాంత ఐఆర్‌ఎస్‌ వెంకట కృష్ణారావు కోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అంబులెన్సులను ఆపే హక్కు ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం అంబులెన్సులను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఏపీ అడ్వకేట్ జనరల్ ఎన్.శ్రీరాం వాదనలు వినిపిస్తూ అన్ని రాష్ట్రాలూ సవాళ్లను ఎదురొకంటున్నాయని అన్నారు. ఖమ్మం విజయవాడకు సమీపంలోనూ, ఆదిలాబాద్ మహారాష్ట్రకు దగ్గరగా ఉన్నాయని అక్కడి వారు సమీప ప్రాంతాలకే వైద్యం కోసం వెళ్తుంటారన్నారు. అలాగే చాలా ప్రాంతాలవారు అత్యవసర వైద్యం కోసం మెరుగైన సౌకర్యాలున్న హైదరాబాద్ వస్తుంటారని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories