Corruption in Ananthapur: అవినీతి అనకొండ.. ట్రెజరీ ఉద్యోగి నిర్వాకం
Corruption in Ananthapur: కొంతమంది అధికారులకు ఉద్యోగం వచ్చిందంటే చాలు..
Corruption in Ananthapur: కొంతమంది అధికారులకు ఉద్యోగం వచ్చిందంటే చాలు.. ఆ మర్నాడు నుంచే లంచాలు మింగడం అలవాటు చేసుకుంటున్నారు. వారు కూర్చున్న స్థానం ఏమిటనేది కాదు.. ఉన్నదాన్నే ధనార్జనను అనువుగా మార్చుకుంటున్నారు. కేవలం ఒక ట్రెజరీ ఉద్యోగి కిలోల కొద్దీ బంగారాన్ని అక్రమార్జన చేశారంటే ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోచ్చు. దీనిని రూపు మాపిన నాడే ఏ ప్రభుత్వమైనా స్వచ్ఛమైన పాలన అందించే వీలుంటుంది.
అనంతపురం జిల్లాలో ఊహకందని విధంగా ట్రెజరీ ఉద్యోగి కారు డ్రైవర్ బంధువు ఇంట్లో భారీఎత్తున అవినీతి 'ఖజానా' బయటపడింది. అచ్చం సినిమాను తలపించే విధంగా మారుమూల ప్రాంతంలోని ఓ చిన్న ఇంట్లో 8 ట్రంకు పెట్టెల్లో దాచిపెట్టిన కిలోలకొద్దీ బంగారం, వెండి, పెద్దఎత్తున నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడం సంచలనమైంది. ఇదంతా అనంతపురం జిల్లా ఖజానా కార్యాలయంలో పనిచేసే ఓ సీనియర్ అకౌంటెంట్‌కు చెందిన అవినీతి సంపాదన అని తెలిసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇందులోనే ఓ ఎయిర్ పిస్టోల్ కూడా లభ్యమైంది. పోలీసుల నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
► అనంతపురం జిల్లా ఖజానా కార్యాలయంలో మనోజ్‌కుమార్ అనే వ్యక్తి సీనియర్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అతడు బుక్కరాయసముద్రం ఎస్సీ కాలనీకి చెందిన నాగలింగను కారు డ్రైవర్‌గా పెట్టుకున్నాడు.
► ఇటీవల సీసీఎస్ పోలీసులకు మనోజ్‌కుమార్, నాగలింగపై ఫిర్యాదు వెళ్లడంతో కొన్ని రోజులుగా వారిద్దరి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
► ఈ క్రమంలో మంగళవారం సీసీఎస్ డీఎస్పీ ఇ.శ్రీనివాసులు, అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలోని బృందాలు డ్రైవర్ నాగలింగను అరెస్ట్ చేశారు.
► నాగలింగ ఇచ్చిన సమాచారం ఆధారంగా సాయంత్రం అతడి మామ బాలప్ప ఇంటిని పోలీసులు తనిఖీ చేయగా.. 8 ట్రంకు పెట్టెలు లభ్యమయ్యాయి.
► వాటిని తెరచి చూడగా కిలోల కొద్దీ బంగారం, వెండి, భారీ మొత్తంలో నగదు వెలుగు చూశాయి. తహశీల్దార్ మహబూబ్ బాషా సమక్షంలో పంచనామా నిర్వహించారు.
► రెండు పెట్టెల్లోని సొత్తును లెక్కించేసరికి అర్ధరాత్రి దాటిపోయింది. మొత్తం సొత్తును లెక్కించే ప్రక్రియ కొనసాగుతోంది.
► మరోవైపు ఖజానా కార్యాలయం సీనియర్ అకౌంటెంట్ మనోజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. ఈ కేసుపై మరో రెండు రోజుల్లో పూర్తి స్పష్టత రానుంది.
'కారుణ్య' నియామకం పొంది..
► జిల్లా ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ మనోజ్‌కుమార్ అవినీతి అనకొండగా ముద్ర వేసుకున్నాడు. అడ్డూఅదుపు లేకుండా అక్రమార్జనకు పాల్పడి రూ.కోట్లకు పడగలెత్తాడు.
► తండ్రి పోలీసు హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ మరణించగా, కారుణ్య నియామకం కింద మనోజ్ కుమార్‌కు 2006 నవంబర్ 17న ట్రెజరీ శాఖలో జూనియర్ అకౌంటెంట్‌గా ఉద్యోగం వచ్చింది.
► రెండు మూడేళ్లకే అతడు కార్యాలయంలోనే అత్యంత అవినీతిపరునిగా పేరొందాడు.
బదిలీ చేసినా తిరిగి ఇక్కడికే..
► ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు 14 ఏళ్లుగా ఇతను జిల్లా ట్రెజరీ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నాడు.
► గతంలో ఒకసారి ఇక్కడి నుంచి బదిలీ కాగా.. రాత్రికి రాత్రి రద్దు చేయించుకుని తిరిగి అదే స్థానానికి వచ్చాడు.
► గత ఏడాది జూలైలో ధర్మవరం సబ్ ట్రెజరీకి బదిలీ రాగా.. 6 నెలలు పాటు సెలవులో వెళ్లి, తిరిగి జిల్లా ట్రెజరీ కార్యాలయానికి బదిలీ చేయించుకోవడం గమనార్హం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire